తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోండి గణేష్ నిమర్జన ఉత్సవ కమిటీ అధ్యక్షులు యెర్రా కామేష్ గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిమజ్జన కమిటీ అధ్యక్షులు,న్యాయవాది యెర్రా కామేష్ విజ్ఞప్తి చేశారు.శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత పవిత్ర గోదావరి నదిలో ఎక్కువ సంఖ్యలో విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం జరుగుతుందని గుర్తు చేశారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గణపతి విగ్రహాలు పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనానికి తరలి వెళ్తాయని తెలిపారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదే విధంగా జిల్లా కేంద్రంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసిన వారు సాధ్యమైనంత తొందరగా ప్రకాశం స్టేడియం గ్రౌండ్ కు చేరుకునేలా ముందస్తు ప్రణాళికను రూపొందించుకోవాలని కోరారు.గతంలో స్థానిక ప్రకాశం స్టేడియం వచ్చిన తర్వాతే నిమజ్జనానికి వెళ్లే విధంగా రూట్ మ్యాప్ ఉండేదని గుర్తు చేశారు కాలక్రమేనా ఈ విధానానికి స్వస్తి పలకడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని గుర్తు చేశారు.గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 25వ తేదీన జరిగే గణపతి శోభాయాత్రను ప్రకాశం స్టేడియం గ్రౌండ్ నుంచి అనుమతించాలని ఆవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకు,పోలీసు యంత్రాంగానికి,ఉత్సవ కమిటీ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు మొదలవడం శుభసూచకమని అన్నారు.గణపతి నిమజ్జన శోభాయాత్ర ముగిసేవరకూ బెల్టు షాపులను ఓపెన్ చెయ్యకుండా ఎక్సైజ్,పోలీసు శాఖ వారు చర్యలు తీసుకోవాలని,వారికి మద్యం షాపు యజమానులు సహకరించాలని కోరారు.నిమజ్జన శోభాయాత్రను ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో ఒంటిగంటకు పూజ చేసి ప్రారంభించడం జరుగుతుందని ఈలోగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు తమ తమ ప్రతిమలతో ప్రకాశం స్టేడియం గ్రౌండ్ కు చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఒంటిగంట నుంచే గణపతి శోభాయాత్రను ప్రారంభించడం ద్వారా పవిత్ర భద్రాద్రి గోదావరి నదిలో నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేందుకు సహకరించిన వారమవుతామని తెలిపారు గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల తో ముడిపడి ఉన్నదని ఈ విషయాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు,భక్తులు గమనించాలన్నారు టపాసులు పేలుస్తూ,పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ డీజే బాక్సులతో ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా సాంప్రదాయ వాయిద్యాలతో భక్తి భావంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఏ.లక్ష్మణ్,ప్రధాన కార్యదర్శి దారా రమేష్,వందనపు శ్రీధర్,అకిరెడ్డి మహేష్,మెరుగు చింటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ