Wednesday, 04 November 2026 09:05:20 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

ఘనంగా ప్రారంభమైన ప్రజాచైతన్య యాత్ర. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని.

Date : 06 August 2026 05:58 PM Views : 217

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దేశంలో దొంగల రాజ్యం సాగుతోంది.బద్లావ్ జరూరీ హై మార్పు కావాలి.కేంద్రంలోని బిజేపి ప్రజావ్యతిరేక విధానాలు తిప్పి కొడదాం.యువత పోరాటంతో దిగొచ్చిన మోడి సర్కార్.ఫ్యూచర్ సిటీ ఓకే పేదల ఇళ్ల సంగతి ఏంటీ?.కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలుపుకోవాలి.ప్రజా ప్రయోజనాల కోసం కడదాకా పోరాడేది కమ్యూనిస్టులే.సిపిఐ ఏఐటియూసి ఐక్యపోరాటంతో దక్కిన ఓసి టూ డిజ్సైట్ బ్లాక్.స్థానిక సంస్యల పరిష్కారకోసం నిరంతర ఉద్యమాలు.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని. ఘనంగా ప్రారంభమైన ప్రజాచైతన్య యాత్ర.ఆకట్టుకున్న డప్పు వ్యాయిద్యాలు నృత్యాలు.అడుగడుగునా ప్రజల బ్రహ్మ రథం. బిజేపి రూపాన దేశంలో దొంగల రాజ్యం సాగుతోందని, ఆ దొంగల నుండి దేశాన్ని కాపాడుకుని, ప్రజాస్వామాన్ని పరిరక్షించుకునేందుకు బద్లావ్ జారూరి హై మార్పు కావాలని, మార్పు అనివార్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్రంలో నానాటికీ పెరిగిపోతున్న బీజేపీ ప్రజావ్యతిరేక పాలనను నిరశిస్తూదేశవ్యాప్త పిలుపులో భాగంగా ప్రజాచైతన్య యాత్ర గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని ఏడూళ్లబయ్యారం గ్రామంలో కూనంనేని సిపిఐ జెండాను ఊపి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆ గ్రామంలోని ఏఐటియూసి కార్యాలయంలో ఏఐటియూసి జెండాను, బయ్యారం క్రాస్ రోడ్లోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. తొలిరోజు బయ్యారం క్రాస్రోడ్ మీదుగా రామానుజవరం, మణుగూరు, అశ్వాపురం, మొండికుంట వరకు ప్రజాచైతన్యయాత్ర సాగింది. యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మ రథం పట్టారు. డప్పు వాయిధ్యాలు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ, మోడి అనుకూల కార్పోరేట్శక్తుల రూపంలో దేశంలో దొంగల రాజ్యం సాగుతోందన్నారు. దేశ ప్రజల సంపదను కారుచౌకుగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీ దొంగలు, ప్రజా ధనాన్ని కారుచౌకుగా దోచుకునే బడా చోరీలు, పరిశ్రమల్లో కార్పోరేట్ ఆస్పత్రుల్లో సిఎంఆర్ఎఫ్ నిధుల మాయలో, విద్య వైద్యం ప్రైవేటు వంటి దొంగల రాజ్యం దేశంలో నిసిగ్గుగా సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దొంగలందరినీ పెంచి పోషిస్తున్న మోడి భరతం త్వరలోనే పడతామని చెప్పారు. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా వాటిని అదుపు చేయలేకపోతున్నారని ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బిజేపి నిరుద్యోగ భారతాన్ని తయారు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దేశ యువత క్రీయాశీలక | పాత్ర పోషిస్తూ చేసిన పోరాటం దేశం చరిత్రలోనే చిరస్మరణీయమని, ఆ పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పలేదని, యువత దెబ్బకు విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. యువతరం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని దేశతలరాతని మార్చే సత్తా యువతకే ఉందన్నారు. కేంద్రంలో సాగుతున్న నిరంకుశ పాలన వల్ల ధరలు పెరిగిపోతున్నాయని, సార్వత్రిక విద్య వైద్యం అందుబాటులో లేదని, యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్నారని పంటలకు కనీస మద్దతు ధర లేదని, కార్మిక హక్కులు కాలరాస్తున్నారని, దళితులు ఆదివాసీలపై అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయన మండిపడ్డారు.ఇంకా చూస్తూ ఊరుకుంటే దేశానికి భావితరానికి మంచిది కాదని చెప్పారు.ఇప్పటికైనా మోడి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు యువత, మేధావులు, ఉద్యోగులు, సబ్బండ వర్గాలు నడుంబిగించి బిజేపిని గద్దె దించాలని చెప్పారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను ఇప్పటికైనా నిలుపుకోవాలన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ నిర్మించడం సరేనని, కానీ రాష్ట్రంలో పేదల ఇళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పెండిగ్ సమస్యలు ఉన్నాయని వాటిని పర్కిరించేందుకు ప్రభుత్వం చొరవచూపాలని చెప్పారు. ఓట్ల కోసం కమ్యూనిస్టులతో స్నేహం చేసి ఆ తర్వాత బోడమలయ్య చందంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మాకు కుర్చీలు అవసరం లేదని ప్రజల పక్షాన అనునిత్యం పోరాటాలు సాగిస్తూనే ఉంటామని చెప్పారు. కమ్యూనిస్టులను తక్కువ చేసి చూస్తే కాంగ్రెస్కు కూడా బిఆర్ఎస్కు పట్టిన గతే పడుతుందని చెప్పారు. తమ సంఖ్య మీకు తక్కువే కనబడవచ్చు గానీ రాష్ట్రంలో అధికారం నుంచి దించేది, అధికార పీఠం ఎక్కించేది కమ్యూనిస్టులే అని చెప్పారు. ఇప్పటికైనా పొత్తు ధర్మాన్ని పాటించాలని హితవు పలికారు. స్థానిక సంస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతర పోటాలు సాగిస్తుందని సింగరేణి సంస్థకు ఓసి టూ డిప్ సైడ్ బొగ్గు బ్లాక్ దక్కిందుకు సిపిఐ ఏఐటియూసి ఐఖ్యపోరాటాలే కారణం అన్నారు. సింగరేణి సంస్థ మనుగడ కోసం అనునిత్యం పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. తలాపునే గోదావరి జలాలు ఉన్నా జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీరు అందడం లేదని, సీతారామ, సీతమ్మధారా ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను ఇతర జిల్లాలకు తరలించుకుపోయే ప్రయత్నం సాగిస్తున్న పాలకులు ఈ జిల్లాకు సాగునీరు అందించిన తర్వాతే ఇతర జిల్లాలకు తరలించుకుపోవాలని చెప్పారు. లేదంటే ఉద్యమాల ద్వారా తమ జలాలను తాము దక్కించుకుంటామని చెప్పారు. జిలాల్లో మిగిలిన పోడు భూములకు పట్టాలివ్వాలని, అర్హులన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని, ఇందరమ్మ ఇళ్ల లబ్దిదారులకు సకాలంలో బిల్లులు మంజూరు చేయాలని తరతరాలుగా గిరిజనులతో పాటు సహజీవనం సాగిస్తున్న వారికి భూ హక్కులు కల్పించాలని ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి హేతుబద్దమైన పరిహారం ఇవ్వాలని, పొలుసుబొంత ప్రాజెక్టును పూర్తి చేయాలని, బిటిపిఎస్ నిర్వాసితులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని అసంఘటిత రంగ కార్మికులకు సమగ్రచట్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఎప్పటికీ ఎప్పటికీ పోరాటాలు సాగిస్తుందని, కమ్యూనిస్టుల పనైపోయిందని పేలేవారికి తమ పోరాటాలు వాటి విజయాలే సరైన సమాధానాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వర్లు, మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సరెడ్డిపుల్లారెడ్డి, నరాటి ప్రసాద్, మున్నా లక్ష్మీ కుమారి, ఎస్ డి సలీం, కే సారయ్య, సలిగంటి శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, కమటం వెంకటేశ్వరరావు, మువ్వా వెంకటేశ్వరరావు రేసు ఎల్లయ్య దేవరకొండ శంకర్ యు రాహుల్ ఎస్కే ఫహీమ్, మహిళా సమాఖ్య, విద్యార్థి యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :