తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ దేశంలో శత వసంతాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అని, తొలినాళ్ల నుండి ఇప్పటి వరకు పేదలు, బడుగు, బలహీన వర్గాలు కోసం పోరాటాలు సాగించిందని, రానున్న మరో వందేళ్లు కూడా ఇదే స్పూర్తితో ప్రజా క్షేత్రంలో మనగలమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్కి సాబీర్ పాషా అన్నారు. జూలూరుపాడు చేరుకున్న సిపిఐ ప్రచార జాతకు ఘన స్వాగతం పలికి ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. కొమరం భీమ్, డా బిఆర్ అంబేద్కర్ విగ్రహానిలకు పూలమాలలు వేసిన అనంతరం సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వలన ఈ దేశాన్ని అంబానీ ఆదానీలకు నరేంద్ర మోడీ మరింత బలవంతుడిని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ జిల్లాలో పేద ప్రజలకు పోడు భూమల పట్టాలు ఇప్పించిన ఘనత సిపిఐ కి ఉందని, దేశ స్వతంత్ర ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలకు సమీకరించి పోరాటాలలో అగ్ర భాగాన నిలిచారని కార్మిక విద్యార్ధి రైతు మహిళ యువజన సంఘాలు నిర్మించి దేశ సమైక్యత కోసం పోరాటలు నిర్వహించారని ఖమ్మం జిల్లా కేంద్రంలో 5 లక్షల మందితో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వర్లు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సారెడ్డి పుల్లారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రేసు ఎల్లయ్య, వేల్పుల మల్లికార్జున్, మున్నా లక్ష్మి కుమారి, అజిత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ