Wednesday, 16 September 2026 09:54:03 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం RDO కార్యాలయం ఎదుట ధర్నా

Date : 03 September 2026 05:51 PM Views : 94

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాంగ్రెస్ సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు.22ఏ ద్వారా నిషేధిత జాబితాలో పెట్టిన ప్రైవేట్ భూములను అందులో నుంచి విడుదల చేయాలని,రామవరం ప్రాంత వాసులకు పొజీషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ 1000 రోజుల పాలనా వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు పిలుపు మేరకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావుల సూచనల మేరకు ఈ ధర్నా జరిగింది.ఈ కార్యక్రమంలో వందలాదిగా పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ కండువాలు ధరించి, జెండాలు, ప్లకార్డులు చేతబట్టి రేవంత్ రెడ్డి అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హయాంలో 76 జీవో ప్రకారం కొత్తగూడెం మునిసిపాలిటీలో 10వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని మాజీ మున్సిపల్ చైర్మెన్ సీతామహాలక్ష్మీ, మాజీ వైస్ చైర్మెన్ వేల్పుల దామోదర్ తెలిపారు. ఆ జీవో ప్రకారం సిద్ధంగా ఉన్న 4వేల పట్టాలను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అదేవిధంగా రామవరం ప్రాంత వాసులు ఇండ్లు కొనుక్కోలేక,అవసరాలకు అమ్ముకునే వీలులేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి వెంటనే పొజీషన్ సర్టిఫికెట్లు జారీ చేయాల్సిందిగా ఆర్డీవోకు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు."అబద్ధపు హామీలతో అధికారం-1000 రోజులుగా కాంగ్రెస్ మోసం","అమలు కాలేదు ఒక్క గ్యారంటీ-హస్తం పతనానికి మాది గ్యారంటీ","ఆరు గ్యారంటీ లు ఎగ్గొట్టిన రేవంత్-నిన్ను ఇంటికి పంపడం మా వంతు"అని రాసిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.ఈ ఆందోళన కార్యక్రమంలో మునిసిపల్ కార్పొరేషన్ కార్పోరేటర్ సాగర్ మల్హోత్రా, మాజీ కౌన్సిలర్లు బండారు రుక్మాంగధర్, అంబుల వేణుగోపాల్, నాయకులు ముద్దంగుల మహేష్, ఏమునరి శివ కృష్ణ, జూనూరి రాజేష్, ఖాజాభక్ష్, మాదాసు పద్మ, ధీకొండ సునీత, మనోజ్, జానీ, కాళీ, సచిన్, అమర్, సిద్ధూ, సుందర్, సురేందర్, చంద్రయ్య, సుధీర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :