Thursday, 17 September 2026 01:36:28 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా భూ రీ సర్వేను వేగవంతం చేయాలి:రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Date : 03 September 2026 08:21 PM Views : 119

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.రాష్ట్రవ్యాప్తంగా భూ రీ - సర్వేను వేగవంతం చేయాలి: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో వేగం పెంచాలి.. మందకొడి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు విధులకు హాజరుకాకపోతే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెవెన్యూ, రీ - సర్వే, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై భద్రాద్రి ఐడిఓసి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాప్రజా ప్రతినిధులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, గృహ నిర్మాణ శాఖల కార్యదర్శులతో సమీక్ష.అలసత్వం వహించే అధికారులను ఉపేక్షించేది లేదు.. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొంగులేటి .రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, ప్రతి భూయజమానికి చట్టబద్ధమైన హక్కులు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం భద్రాద్రి ఐడీఓసీ కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని రెవెన్యూ, భూ రీ-సర్వే, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ (సీ.సీ.ఎల్.ఏ), రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిగా డి.ఎస్. లోకేశ్ కుమార్, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి (రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు) రాజీవ్‌గాంధీ హనుమంతు లతో కలిసి ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని భూ రీ - సర్వే పురోగతి, నాన్-కెడస్ట్రల్ , కెడస్ట్రల్ గ్రామాల్లో సర్వే పనులు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల పనితీరు, 22-ఏ భూముల వివరాలు, సాదా బైనామాలు, అటవీ – రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలు, ధరణి స్థానంలో అమలులోకి వచ్చిన భూ భారతి చట్టం, రిజిస్ట్రేషన్ శాఖ నూతన కార్యాలయాల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, రెండో విడత ఇళ్ల మంజూరు, ఉచిత ఇసుక సరఫరా తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..సామాన్య ప్రజానీకం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని రూపొందించి దానిని పకడ్బండిగా అమలు చేస్తుందని తెలిపారు. అందులో భాగంగా రెవిన్యూ సిబ్బంది తాహసిల్దార్, ఆర్డీవోలు సిబ్బంది పనిచేయాలన్నారు. భూములు ఉన్నవారికి న్యాయం చేసేలా ఈ భూ భారతి చట్టం రూపొందిందని, ఏటువంటి దరఖాస్తులు వచ్చిన సర్వే చేసి సంబంధిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధుల పూర్తి సహాయ సహకారాలు సమన్వయంతో ఈ సర్వేను పూర్తి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలే ముఖ్యమని వారి సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలు, రైతుల కోసమే ఈ చట్టాన్ని రూపొందించామని అధికారులకు సిబ్బంది కోసం కాదని అధికారులను హెచ్చరించారు. అలసత్వం చేసిన ఎలాంటి అధికారినైనా ఉపేక్షించేది లేదని శాఖ పరమైన చర్యలు తక్షణమే తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ రివ్యూ సమావేశం కేవలం కాగితాల కోసం పెట్టలేదని.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలను వెలికి తీసి అధికారుల సమక్షంలో పరిష్కరించేందుకు ఏర్పాటు చేశామని తెలియజేశారు. గత కొన్ని నెలలుగా కార్యాలయాల్లో ఎన్ని అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అధికారుల ప్రవర్తనలో మార్పు రాకపోతే వారిపై చర్యలు తీసుకుంటానని మంత్రి పొంగులేటి అన్నారు. ఎంతమంది లైసెన్స్ సర్వేయర్లు విధులు నిర్వహిస్తున్నారని వారి పరిధిలో ఎంత భూమి సర్వే చేశారో నివేదిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. అధికారులు చేసే పనులకి రాష్ట్ర ప్రభుత్వం తలదించుకునేలా ఉంటుందని, సరి చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవని అన్నారు. ఏ దినపత్రిక చూసిన సబ్ రిజిస్టర్లు, తాహసిల్దారుల పైనే కథనాలు ప్రచురితమవుతున్నాయని వాటన్నిటిని నివేదిక నా దగ్గర ఉందని తెలియజేశారు. నిబంధనల విరుద్ధంగా పనిచేసే హక్కు, ధైర్యం మీకు ఏవరించారని ఆ విధంగా పనిచేస్తే ఉపేక్షించనని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాల అదనపు కలెక్టర్లను, సబ్ రిజిస్టర్ లను కిందిస్థాయి అధికారులతో సమన్వయంతో పనిచేసి సకాలంలో ఈ సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకునే ప్రతి దరఖాస్తుదారుడు ఒక మనిషిగా అధికారులు గుర్తించాలని ఆ విధంగా వారి సమస్యను పరిష్కరించేలా పనిచేయాలని అన్నారు. మొదటి విడత ఎల్ 1 క్యాటగిరిలో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ళను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు ప్రారంభం గాని ఇల్లులు రెండో విడత ఇందిరమ్మ ఇల్లుల జాబితాలో చేర్చాలన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రవాణాతో కలిపి రు. 230 సిమెంట్ బస్తా ఉందని వాటితో లబ్ధిదారులకు వెలుసుబాటు కలుగుతుందని అధికారులు లబ్ధిదారులకు అందుబాటులో ఉండి సహకరించాలని సూచించారు. రాష్ట్రంలో జనగామ కలెక్టర్ రూపొందించిన యాప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉందని వాటిని అన్ని జిల్లాల కలెక్టర్లు అమలు చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ-సర్వేలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు తప్పనిసరిగా పాల్గొనాలని మంత్రి స్పష్టం చేశారు. రీ-సర్వే విధులకు హాజరుకాకుండా ప్రైవేట్ సర్వేలకు మాత్రమే పరిమితమయ్యే సర్వేయర్లకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.భూ సర్వే పనులకు అవసరమైన శిక్షణ పొందిన సిబ్బందిని తగిన సంఖ్యలో సిద్ధం చేయాలని, ప్రత్యామ్నాయ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను ఆదేశించారు. సర్వే పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సర్వేను వేగవంతం చేయాలన్నారు.ధరణి స్థానంలో ప్రభుత్వం నూతన భూ భారతి వ్యవసాయ, రెవెన్యూ చట్టాలను తీసుకువచ్చి, అధికారాలను వికేంద్రీకరించి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించిందని మంత్రి తెలిపారు.ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా, పారదర్శకంగా రెవెన్యూ సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సాదా బైనామాలు తదితర సమస్యలను సమగ్రంగా పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి రైతుకు చట్టబద్ధమైన హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా సమావేశమై, శాస్త్రీయ పద్ధతుల్లో భూముల కొలతలు చేపట్టి సరిహద్దులను నిర్ధారించాలని సూచించారు.గతంలో పోడు భూములకు పట్టాలు పొందిన రైతులు బోర్లు, విద్యుత్ కనెక్షన్లు తదితర సౌకర్యాలు పొందే సమయంలో ఎలాంటి ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, మంజూరు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఇళ్ల మంజూరులో లబ్ధిదారుల నుండి డబ్బులు తీసుకుంటే సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.ప్రజలకు చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తూ, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం, పేదలకు సొంతింటి కలను సాకారం చేయడం ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.భూ సర్వే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలులో అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, మాలోత్ రాందాస్ నాయక్, కోరం కనకయ్య,డాక్టర్ మట్టా రాగమయి,జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావ్,ఖమ్మం,భద్రాద్రి జిల్లా కలెక్టర్లు దివాకర్,అంకిత్,జిల్లా అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) వేణుగోపాల్, శ్రీనివాసరావు,స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ,విద్యా చందన,భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్,డీ.ఎఫ్.ఓ విక్రమ్ సింగ్,కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్,సర్వే, ఫారెస్ట్, ఇతర శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :