Wednesday, 16 September 2026 04:45:13 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 11 September 2026 09:57 AM Views : 976

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, సీతమ్మ సాగర్, పులుసుబొంత ప్రాజెక్టులు, బీ.టీ.పీ.ఎస్ భూసేకరణ వేగవంతం చేయాలి. భూభారతి రీ - సర్వే,సాదా బైనమా,రెవిన్యూ సదస్సులు క్యాంప్ మోడో లో జరిపించాలి.నిర్దేశించిన సమయాల్లో పూర్తి చేయాలని ఐ.డీ.ఓ.సీలో ని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఎస్.డీ.సీ (ఎల్.ఏ), తహసీల్దార్,ఇరిగేషన్, సంబంధిత సెక్షన్ అధికారులు, సర్వేయర్లతో వీడియో కాన్ఫిరెన్స్.భూ సేకరణ పనులు,సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.ఐ.డీ.ఓ.సీ లోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట్ ,జిల్లాలోని తహసీల్దార్,ఇరిగేషన్, సంబంధిత సెక్షన్ అధికారులు, సర్వేయర్లలతో జిల్లా కలెక్టర్ అంకిత్ వీడియో కాన్ఫిరెన్స్ గురువారం నిర్వహించారు.సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, పులుసుబొంత ప్రాజెక్టులు, బీ.టీ.పీ.ఎస్ ల భూసేకరణ పనులు వేగవంతం చేయాలని తాహసిల్దార్లను, సర్వేయర్లను ఆదేశించారు.నిర్దేశించిన సమయాలోపు పనులు పూర్తి చేసేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు పెండింగ్లో ఉన్న పనులను మానిటరింగ్ చేస్తూ సమస్యలు పరిష్కరించేలా తాహసిల్దారులతో మాట్లాడాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్ కు జిల్లా కలెక్టర్ సూచించారు.జిల్లాలో అన్నీ మండలాల్లో కొనసాగుతున్న భూభారతి రీ - సర్వే,సాదా బైనమా,రెవిన్యూ సదస్సులు క్యాంప్ మోడో లో జరిపించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ప్రణాళిక బద్ధంగా,నిబద్ధతతో సకాలంలో సర్వే బృందాలతో అధికారులు పనిచేయించాలని తెలిపారు.సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు, ఐ.కే.పీ సర్వేయర్లు ఈ రీ - సర్వే ప్రక్రియను ను సీరియస్ గా తీసుకొవాలని జిల్లా కలెక్టర్ కోరారు.జిల్లాలో ఉన్న అన్నీ మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు రీ - సర్వే ను సకాలంలో పూర్తి చేసేలా ప్రతిరోజు ప్రణాళిక బద్ధంగా సర్వే చేసి,ఆ రికార్డులను నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. ప్రతి మండలంలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు సర్వేయర్లతో సర్వే చేయించాలని తెలిపారు.ఇటీవలే జిల్లాలో పది మండలాల్లో గ్రామసభలు నిర్వహించారని,ఆ ప్రాంతాల్లో రీ - సర్వే వేగవంతమయ్యేలా పనులు చేపట్టాలని ల్యాండ్ సర్వే ఏ.డి శ్రీనివాస్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ప్రతి మండల తాహసిల్దార్లు, సర్వేయర్లతో వారు చేస్తున్న సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంత సర్వే చేశారని,ఆ సర్వే వివరాలు రికార్డును సకాలంలో పూర్తి చేయాలని తెలియజేసారు.యుద్ధ ప్రాతిపదికన సర్వే పూర్తిచేసేలా తాహసిల్దార్లు, సర్వేయర్లు బాధ్యతతో పనిచేసే సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. భూభారతి దరఖాస్తులు ప్రతి మండల తాసిల్దార్లు, ఆర్డీవోలు, సబ్ కలెక్టర్ లాగిన్ లో పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే పరిశీలించి పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "సర్" కార్యక్రమంలో ఓటర్లు వద్ద నుంచి ఓటు నమోదుకు సరైన ధ్రువపత్రాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని ఏ.ఆర్.ఓ.ఎస్, ఏ.ఈ. ఆర్.ఓ.ఎస్ బాధ్యత తీసుకొని పనిచేయాలన్నారు. ఈ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉందని, ప్రతి ఓటరు ధ్రువపత్రాలు సక్రమంగా ఉండేలా క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :