Saturday, 19 September 2026 02:53:42 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

మర్చి 31 నాటికి భూ క్రమబద్ధీకరణ కు ప్రభుత్వం కల్పించిన ఎల్. ఆర్. ఎస్ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ జితేష్

Date : 11 March 2025 07:37 PM Views : 811

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మార్చి 31 నాటికి భూ క్రమబద్ధీకరణ చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన ఎల్. ఆర్.ఎస్ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. ఎల్.ఆర్. ఎస్ పై అవగాహన కల్పించేందుకు మంగళవారం ఐ డి ఓ సి కార్యాలయ సమావేశ మందిరంలో టౌన్ ప్లానర్ లు, లే అవుట్ రైటర్ లు, బిల్డర్లతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 2020 తర్వాత కచ్చా లేఔట్ చేసిన వారు, వాటిలో ప్లాట్ లు తీసుకున్నవారు జిల్లాలో 5488 మంది ఎల్. ఆర్.ఎస్ కొరకు దరఖాస్తు చేసుకున్నారని, కానీ ఇప్పుడు క్రమబద్ధీకరణ చేసుకునేందుకు కేవలం 400 మంది మాత్రమే ముందుకు వచ్చి డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల ద్వారా నోటీస్ లు జారీ చేసినప్పటికీ ఫోన్ నెంబర్లలో తేడాలు, చిరునామాల్లో తేడాలు ఉండటం వల్ల అవి ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి చేరడం లేదన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో 2112 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన తెలిపారు. లే అవుట్ లు చేసిన వారు, ఓనర్లు, రైటర్ లు, బిల్డర్లు ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సమాచారం, అవగాహన కల్పించి సకాలంలో ఎల్.ఆర్.ఎస్. చేయించుకునే విధంగా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అవగాహన లేకపోవడం లేదా సమాచారం లేకపోవడం వల్ల సద్వినియోగం చేసుకోకుంటే రేపటినాడు ఎప్పుడైనా ఎల్. ఆర్.ఎస్ ఆమోదం లేని ప్లాటు పై ఇల్లు కట్టుకోవాలంటే అప్పటి ప్లాట్ వాల్యూ పై ప్రో రేటా ఫీజు తో పాటు 14 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు. నిషేధిత స్థలం లేదా చెరువు, కుంట కింద లేకుంటే ప్లారు యజమాని ఫోన్ కు నేరుగా ఎంత డబ్బులు కట్టాలో సమాచారం వెళుతుందన్నారు. ఏదేని కారణం చేత ఎల్.ఆర్.ఎస్. ఎల్.ఆర్.ఎస్ ఉంటే ప్లాటుకు రక్షణ ఉంటుందని, ఎవరు అక్రమించుకోడానికి అవకాశం ఉండదని అదేవిధంగా లే అవుట్ ప్లాట్ల ప్రాంతాన్ని మున్సిపాలిటీ ద్వారా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో ప్లాటు అమ్ముకోవాలనుకున్న ఎల్.ఆర్ ఎస్ ఉన్న ప్లాటు కు మంచి డిమాండు ఉంటుందని తెలియజేశారు. బిల్డర్లు, లే అవుట్ ప్లానర్ లు ప్లాటు యజమానులతో సంప్రదించి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవిధంగా చూడాలని కోరారు. ఈ సమావేశంలో సబ్ రిజిస్టర్ వేణుమాధవ్, కొత్తగూడెం, పాల్వంచ టౌన్ ప్లానింగ్ ఇంజినీర్ లు, బిల్డర్లు లేఔట్ ప్లానర్లు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :