Wednesday, 16 September 2026 10:42:45 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

Date : 13 April 2026 08:02 PM Views : 262

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (అర్బన్) జీవితం విలువైనది భద్రత మన బాధ్యత అంటూ 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ ఆధ్వర్యంలో వాహనదారులు హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించారు. సోమవారం 16వ డివిజన్లో జరిగిన ర్యాలీలో కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మన కార్పొరేషన్ పరిధిలో రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయని అన్నారు .జీవితం విలువైనది, భద్రత మన బాధ్యత, రోడ్డు ప్రమాదాలనేవి కేవలం వార్తలు మాత్రమే కాదని ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం అనేది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదు, మన ప్రాణాలని మనం కాపాడుకోవడానికి నిబంధనలు పాటించాలన్నారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు నాణ్యమైన హెల్మెట్ ధరించడం మర్చిపోవద్దు ఇది మన ప్రాణ రక్ష కవచం అని అన్నారు. కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గుతుందని, వేగం కంటే ప్రాణం ముఖ్యం కాబట్టి పరిమిత వేగంతో ప్రయాణించాలి అన్నారు. మనం ఐదు నిమిషాలు ముందు వెళ్లడం కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించి ప్రమాదాలకు కారణమవుతున్నామని అన్నారు .ఆ ఐదు నిమిషాల తొందర మీ జీవితాంతం మీ కుటుంబాన్ని దూరం చేస్తుంది ఐదు నిమిషాలు లేటుగా వెళ్తే నష్టమేమీ లేదు. వాహనదారులు పాదచారులకు ప్రాధాన్యత నివ్వాలి, వాళ్లను గమనిస్తూ డ్రైవింగ్ చేయాలి మన నగరం సురక్షితంగా ఉండాలంటే కేవలం రోడ్లు బాగుంటే సరిపోదు. మన ప్రయాణ విధానం మారాలి. చట్టం మీద భయంతో కాదు, బాధ్యతతో నిబంధనలు పాటిద్దాం. ఈ రోజు నుంచి మనమందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాంమని, నేను ట్రాఫిక్ నియమాలను పాటిస్తాను, నా కుటుంబాన్ని నాతోటి వారిని కాపాడుకుంటానని ఆమె వారితో ప్రతిజ్ఞ చేయించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దు.రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. ఈ వారోత్సవాల స్ఫూర్తిని ఏడాది పొడవునా కొనసాగిద్దాంమని ఆమె పిలుపునిచ్చారు. విరాలిలో డివిజన్ పౌరులు మునిగడప వెంకటేశ్వర్లు, జిత్తుక దిలీప్ ,గుంజ వెంకన్న, రామ్ రాకేష్ ,వాసం బాబు, సబ్బని పాపారావు ,బి శ్రీను, కందుకూరి గంగరాజు, అఖిల్ ,సూర్య తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :