తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శనివారం ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన మేదర బస్తీకి చెందిన ములుగురి లక్ష్మీ పార్దివదేహానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పూలమాల వేసి నివాళులర్పించారు. తల్లి మరణాన్ని తట్టుకోలేక పుట్టెడు దుఃఖంలో ఉన్న పిల్లల్ని ఓదార్చి, మృతురాలి భర్త శ్రీనివాస్ కు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారి వెంట లగడపాటి రమేష్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పోతు పురుషోత్తం, రాధకృష్ణ, పిల్లి రాజయ్య, సంజీవ్, రాంబాబు, సురేష్, డైమండ్ రావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ