తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి సంస్థలో 23-24 సంవత్సరంలో 70 మిలియన్ టన్స్ బొగ్గు ఉత్పత్తి అయిందని దాదాపు నాలుగు వేల కోట్ల పైన లాభాలు వచ్చినట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారని వచ్చిన లాభాన్ని సింగరేణి యాజమాన్యం వెంటనే ప్రకటించి కార్మికులకు 35%వాటా ఇవ్వాలని టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ , స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కుసాన వీరభద్రం , కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య ఆధ్వర్యంలో మైన్స్ మేనేజర్లకు , డిపార్ట్మెంట్ ఇన్ చార్జీలకు , ఏరియా జిఎం కు వినతి పత్రం అందజేశారు .ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్స్ కాగితపు విజయకుమార్, రాసురి శంకర్,రాజ్ కుమార్,వెంకటేశ్వర్లు, అశోక్, రాజేందర్, రఫీ, నాగరాజు, కరీం, సత్యనారాయణ, సురేష్, రామకృష్ణ కోటి, కృష్ణ సాంబమూర్తి, దేవీ్సింగ్, గణేష్,రమేష్,కుమార్,పూర్ణ చందర్, చందు , బాలరాజు తదితరులు పాల్గొన్నారు. .
Admin
తెలుగు వెలుగు టీవీ