Friday, 18 September 2026 03:35:02 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు… సేవల నాణ్యతపై సమగ్ర సమీక్ష

Date : 17 March 2026 06:19 PM Views : 192

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రెండు రోజుల్లో మార్పు లేకపోతే గుర్తింపు రద్దు – ఏకలవ్య పాఠశాల ఏజెన్సీకి కలెక్టర్ హెచ్చరిక గుండాల మండలంలో ప్రభుత్వ సేవల నాణ్యతను సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా విద్య, వైద్యం, పశుసంవర్ధక మరియు పరిపాలన రంగాలకు సంబంధించిన పలు సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సమయానికి నాణ్యమైన సేవలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. గుండాల మండలం ముతాపురం గ్రామంలోని ఏకలవ్య పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, తరగతి గదులు, ఆర్‌ఓ వాటర్ ప్లాంట్, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, కంప్యూటర్ ల్యాబ్ తదితర సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, పాలు సరఫరా, పరీక్షల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. పరిశీలనలో పాఠశాలలో పరిశుభ్రత లోపాలు, కిచెన్ షెడ్‌లో అస్వచ్ఛత, వంట ప్రాంగణంలో నిర్లక్ష్య నిర్వహణ, సిబ్బంది కొరత, కంప్యూటర్ ల్యాబ్‌లో దుమ్ము పేరుకుపోవడం, మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడం వంటి అంశాలను గమనించి కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించిన కలెక్టర్, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “రెండు రోజుల్లో పాఠశాలలో ఉన్న అన్ని లోపాలను పూర్తిగా సరిచేయాలి. లేనిపక్షంలో ఏజెన్సీ గుర్తింపును రద్దు చేసి బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే చర్యలు తీసుకుంటాం” అని కఠినంగా హెచ్చరించారు. ఉదయం వండిన ఆహారాన్ని సాయంత్రం వరకు నిల్వ ఉంచకుండా, ప్రతి భోజనం తాజాగానే వండించి నాణ్యతతో అందించాలని స్పష్టం చేశారు. అనంతరం గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న 108 అంబులెన్స్ సిబ్బందితో మాట్లాడి వారు అందిస్తున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రధానంగా వచ్చే కేసులు, అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలిస్తున్న ఆసుపత్రులపై ఆరా తీశారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మందుల గది, ఇంజెక్షన్ రూమ్, స్టోర్ రూమ్, రక్త పరీక్షల గది తదితర విభాగాలను పరిశీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్‌లను సమగ్రంగా తనిఖీ చేశారు. డెంగ్యూ పరీక్ష కిట్ల లభ్యతపై విచారించి, అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. మందుల పంపిణీ గదిలో సిబ్బంది అందుబాటులో లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్, కారణాలను ప్రశ్నించారు. మందుల నిల్వ గదిని పరిశీలించి గడువు తేదీలను తనిఖీ చేశారు. మందుల నిల్వ గదిలో ఎయిర్ కండిషనింగ్ సదుపాయం కల్పించడం తో పాటు ఫార్మసిస్ట్‌ను నియమించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ప్రజలకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. అత్యవసర సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వడదెబ్బకు అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి” అని తెలిపారు. గుండాల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్, నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా నిర్దిష్ట గడువులో కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో ఉన్న ఆర్‌ఓ ప్లాంట్ రెండు సంవత్సరాలుగా పనిచేయకపోవడాన్ని గమనించి, ఇప్పటికే మంజూరైన కొత్త ప్లాంట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. కిచెన్ షెడ్‌ను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. వంటకు మినరల్ వాటర్ వినియోగించాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలపై వివరాలు తెలుసుకుని, హిందీ పరీక్షకు శుభాకాంక్షలు తెలియజేశారు. డైనింగ్ హాల్ మంజూరుకు సంబంధించిన ప్రతిపాదనను పరిశీలించి త్వరలోనే అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా ప్రాథమిక పశు వైద్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, మందుల నిల్వలు, రికార్డులు, సిబ్బంది హాజరు, పశువులకు అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై సమీక్షించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలు పశువులపై ఆధారపడి జీవిస్తున్నందున, పశువులకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పశువులకు వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, టీకాలు సమయానికి వేయించడం, అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక సేవలను బలోపేతం చేసి పశుపాలకులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది క్రమం తప్పకుండా పర్యటిస్తూ పశువుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తహసీల్దార్ ఖాసీమ్, మండల ప్రత్యేక అధికారి ఇంతియాజ్ ఖాన్, ఎంపీడీవో బాలరాజు, ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ నితిన్ సింగ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ సుధీర్, కస్తూరిబా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రావణ సంధ్య, బోధన సిబ్బంది, వైద్య సిబ్బంది మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :