Monday, 03 August 2026 09:06:25 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే లక్ష్యం - జల్ శక్తి అంకల్ ను పకడ్బందీగా అమలు చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 22 January 2026 11:18 AM Views : 175

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి ఇంటికి నాణ్యమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా “జల్ శక్తి అంకల్” ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్థాయి త్రాగునీటి సరఫరా పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 1వ తేదీ నుండి 20 రోజులపాటు ప్రత్యేక కార్యాచరణగా జల్ శక్తి అంకల్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరాలో ఉన్న లోపాలను గుర్తించి, వెంటనే పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి గ్రామ, మండల స్థాయిలలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి సరఫరా పరిస్థితిని పరిశీలించి, ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే తక్షణమే గుర్తించి సమగ్ర నివేదికలు సమర్పించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి, వివరాలతో కూడిన నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చోట కొత్త వాటర్ ట్యాంకుల నిర్మాణం, మరమ్మత్తులు, అదనపు వనరుల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. ప్రజలకు నీటి వృధా నివారణపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రహదారుల వెంట, పైపులైన్ల ద్వారా జరుగుతున్న నీటి లీకేజీలను వెంటనే గుర్తించి మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించి, త్రాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, మిషన్ భగీరథ ఈఈ లు, తిరుమలేష్, నళిని, జిల్లా పంచాయతీ అధికారి సుధీర్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా అదనపు డిఆర్డిఓ రవి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :