తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ కూలి లైన్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు తెజోనాధ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన తాజా మాజీ కౌన్సిలర్ రుక్మాంగధర్ బండారి, ప్రధానోపాధ్యాయులు తేజునాథరెడ్డి అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మెన్ మునిగ సుజాత. తదనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తెజోనాధ్ మాట్లాడుతూ బావి భారత పౌరులను తయారు చేసే నిత్య శ్రామికులు నిరంతర జ్ఞానప్రదాతలు ఉపాధ్యాయులు అని అన్నారు. తాజా మాజీ కౌన్సిలర్ రుక్మాంగధర్ బండారి మాట్లాడుతూ భారత రాష్ట్రపతి, గొప్పతత్వవేత్త విద్యావేత్త, అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జ్ఞాపకార్థం అయిన పుట్టినరోజున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గా పాటిస్తారని తెలిపారు. చైర్మన్ సుజాత మాట్లాడు తు మన సమాజంలో అమ్మా, నాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారని తెలిపారు. తదనంతరం ప్రధానోపాధ్యాయు ఉపాధ్యాయులను శాలువతో సత్కరించిన రుక్మాంధర్ బండారి, సుజాత మరియు విద్యార్థిని విద్యార్థులు వారి గురువులందరికీ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి. తేజో నాథరెడ్డి, రుక్మాంగదర్ బండారి, ఛైర్మెన్ మునిగ సుజాత, ఉపాధ్యాయులు లాల్ సింగ్ లాల్, హరిబాబు, రామస్వామి, రామారావు, దేవిలాలు రామారావు మరియు ఉపాధ్యాయుని శ్వేత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ