Thursday, 17 September 2026 04:27:02 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ స్థాయి వసతులతో అభివృద్ధి - కలెక్టర్ జితేష్ వి పాటిల్

Date : 17 June 2025 04:31 PM Views : 607

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని చిన్నారులకు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ. పాత పాల్వంచలోని మండల ప్రాథమిక పాఠశాలల లోని అంగన్వాడీ కేంద్రంలో “అమ్మ మాట – అంగన్వాడి బాట” కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొని అంగన్వాడీ విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దబడి జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ, త్రాగునీటి , మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు.పిల్లలకు అవసరమైన ఆహారం, విద్య, ఆటపాటల వాతావరణం, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అన్నింటిని సమగ్రమైన విధంగా అందిస్తున్నారు అని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అనుభవజ్ఞులైన టీచర్లను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని, వారు చిన్నారుల మానసిక, భౌతిక అభివృద్ధికి తగిన తరగతులు నిర్వహిస్తున్నారని వివరించారు. తల్లిదండ్రులందరు చిన్నారులను ఖరీదైన ప్రైవేటు పాఠశాలలలో చేర్పించి ఆర్థిక భారాన్ని మోసుకోవడం అవసరం లేదు అని,అంగన్వాడీ కేంద్రాల్లోనే ఆధునిక వసతులతో కూడిన విద్యాబోధన అందుబాటులో ఉంది. ముందు అంగన్వాడీలలో చేర్పించి, తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలి. ఇవే పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయి” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాస్, మహిళా శిశు, వయోవృత్తుల మరియు దివ్యంగుల శాఖ అధికారి స్వర్ణలత లేని నా, ఐసిడిఎస్ పిడి , సిడిపిఓ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, పిల్లల, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :