తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం అనంతారం గ్రామం లో రైతు పొలం బాట కార్యక్రమంలో జిల్లా సూపర్నెంట్ ఆఫ్ ఇంజనీర్ మహేందర్ పాల్గొన్నారు. వారు రైతులతో మాట్లాడుతూ విద్యుత్ మోటార్లకు కెపాసిటర్లు వాడటం వలన నాణ్యమైన విద్యుత్ని పొందగలుగుతారని మరియు మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవని అందరూ తప్పనిసరిగా కెపాసిటర్లు వాడాలని రైతులకు వివరించారు. రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుందని స్టార్టర్ బాక్సుల దగ్గర ఎర్త్ వాడాలని ఫీజుల సమస్యలు ఏవైనా ఉంటే మీకు మీరుగా కాకుండా హెల్పర్స్, లైన్మెన్ లను సంప్రదించాలని. నాసిరకం వైర్లను వాడవద్దని మంచి విద్యుత్ కొరకు నాణ్యమైన కేబుల్స్ ని కొనగలరని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిఈ రంగస్వామి, ఏడి యాసిన్, ఏ ఈ సతీష్, సబ్ ఇంజనీర్ ప్రవీణ్, ఎస్ ఎల్ ఐ నరసింహారావు, లైన్మెన్ రమేష్, జేఎల్ఎం భాస్కర్, హెల్పర్ లు వెంకటేశ్వర్లు, గోపాల్ మరియు రైతులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ