Thursday, 17 September 2026 09:46:28 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు .

Date : 18 July 2026 08:10 PM Views : 207

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు . ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి. జిల్లాల వారీగా సూపర్ ఎల్‌నినో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఇన్‌చార్జి మంత్రుల సమీక్షలకు శాఖల వారీ సమగ్ర నివేదికలతో హాజరు కావాలి. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సూపర్ ఎల్‌నినో పరిస్థితులు, వర్షాభావ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయ ప్రణాళికలు, తాగునీటి నిర్వహణ, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి జిల్లా సూపర్ ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రైతులకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పంటల మార్పిడి విధానాలను ప్రోత్సహించాలని, తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సూచనలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు నిరంతరం అందుబాటులో ఉండాలని తెలిపారు.అదేవిధంగా జిల్లాల వారీగా వర్షపాతం పరిస్థితులు, సాగు విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, తాగునీటి లభ్యత, పశుగ్రాసం, ఉపాధి హామీ పనులు, శాఖల వారీ కార్యాచరణ ప్రణాళికలపై సమగ్ర సమాచారాన్ని సిద్ధంగా ఉంచాలని సూచించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ప్రత్యేక అధికారులతో నిర్వహించనున్న సమీక్ష సమావేశాలకు అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయి నివేదికలతో హాజరు కావాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , జిల్లాలో ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ ముందస్తు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి పొదుపు పద్ధతులు, పంటల మార్పిడి, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే సాగు విధానాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, తాగునీటి సరఫరా, పశుగ్రాసం, ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై కూడా సంబంధిత శాఖలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డి ఆర్ డి ఎ పి డి విద్యాచందన, హార్టికల్చర్ అధికారి కిషోర్ బాబు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, గ్రౌండ్ వాటర్ ఏడి రమేష్, మున్సిపల్ కమిషనర్ సుజాత, డిపిఓ అనూష, సిపిఓ సునీత సంబంధిత శాఖ అధికారుల తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :