Thursday, 17 September 2026 09:32:53 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవు – భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్.

Date : 24 August 2026 07:55 PM Views : 227

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్- 19 కేజీల గంజాయి స్వాధీనం.గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవు – భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్.భద్రాచలం డీఎస్పీ ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణ ఎస్సై వి. సతీష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది 23.08.2026 రాత్రి భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పోలీసులను చూసి అనుమానాస్పదంగా పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.విచారణలో వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అజయ్ @ అజయ్ సైని, ఉజ్వల్ @ ఉజ్వల్ సైనిగా గుర్తించారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.మహమ్మద్ అష్రఫ్ ఖురేషి అనే వ్యక్తి రెండు ట్రాలీ లగేజ్ బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లను ఉంచి, బెంగళూరులోని సతీష్ అనే వ్యక్తికి అందజేయాలని సూచించినట్లు నిందితులు తెలిపారు. దీంతో వారు సుకుమ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకుని భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని, బెంగళూరు వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా పోలీసులు పట్టుకున్నారు.నిందితుల వద్ద నుంచి సుమారు 19 కేజీల గంజాయి, దీని విలువ సుమారు రూ.9,41,500/-, అలాగే రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.పట్టుబడిన ఇద్దరు నిందితులను భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించగా, భద్రాచలం పట్టణ ఇన్‌స్పెక్టర్ యం. నాగరాజు కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.ఈ సందర్భంగా భద్రాచలం డీఎస్పీ మాట్లాడుతూ, యువత గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచి, మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా అవగాహన కల్పించాలని కోరారు.గంజాయి అక్రమ రవాణా, విక్రయం, నిల్వ, వినియోగానికి పాల్పడే వారితో పాటు అక్రమ రవాణాకు సహకరించే వ్యక్తులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల అక్రమ విక్రయం, రవాణా, నిల్వకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :