Tuesday, 03 November 2026 01:43:03 PM
# భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి.

హక్కుల పరిరక్షణకు పోరాటంలోకి రావాలి. యు.ఎస్.పి.సి ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతిపత్రం

Date : 25 July 2025 05:34 PM Views : 1098

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జులై 25 తెలుగు వెలుగు )ప్రతి ఆరు నెలలకు ఒక మారు డిఏ మంజూరు, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నూతన వేతన స్కేల్స్ అమలు, ఉద్యోగ విరమణ అయిన ఉద్యోగికి పాత పెన్షన్ అమలు, వెంట వెంటనే ఆర్థిక లాభముల చెల్లింపులు లాంటి హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, ఇట్టి హక్కులను పరిరక్షించుకోవడానికి మిగతా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు యూఎస్పిసి నిర్వహించే పోరాటాలలో కలిసి రావాలని uspc జూలూరుపాడు నాయకులు కోరారు. యూఎస్పిసి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే మూడు దశల పోరాట కార్యక్రమాలలో భాగంగా తాహసిల్దార్ జూలూరుపాడు టీ శ్రీనివాస్ కీ సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించిన అనంతరం హాజరైన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ... పోరాటాలు లేకుండా ఏ సమస్య పరిష్కారం కాదని, రాయితీలు సౌకర్యాలు ఏ ప్రభుత్వం ఆయాచితంగా ఇవ్వలేదనే వాస్తవాన్ని గుర్తించాలని అన్నారు. గత ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటున్న పాలకులు కూడా విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం లేదని అన్నారు. ప్రభుత్వ, గిరిజన సంక్షేమ, గురుకుల, మోడల్, సమగ్ర శిక్ష, ఎయిడెడ్ మేనేజ్మెంట్లలోని విద్యారంగ సమస్యలను అందులో పని చేస్తున్న ఉపాధ్యాయుల, సిఆర్టి (CRT)ల, సిఆర్పి (CRP)ల సమస్యలన్నింటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల పెండింగ్ బిల్లులను ప్రత్యేకించి రిటైర్డ్ అయిన చనిపోయిన ఉపాధ్యాయుల పెన్షనరీ బెనిఫిట్స్ అన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు uspc నాయకులు వీరాస్వామి, మహేష్,వెంకటేశ్వర్లు, నరసింహారావు, సరిత, నాగజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :