Thursday, 17 September 2026 08:43:56 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

పాఠశాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 12 August 2025 03:46 PM Views : 813

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన, శుభ్రమైన విద్యావాతావరణం కల్పించడమే లక్ష్యం అని అందుకోసం ప్రతి పనిని వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ పాఠశాల ప్రవేశ ద్వారం నుండి డైనింగ్ హాల్ వరకు, అక్కడి నుండి వసతిగృహం వరకు విద్యార్థులు సులభంగా, సురక్షితంగా నడవడానికి అనువుగా పాదచార మార్గం (పాత్‌వే) నిర్మాణానికి సివిల్ విభాగం అధికారులను ఆదేశించారు. పాఠశాల ప్రాంగణం అందంగా, ఆహ్లాదకరంగా మారేందుకు చుట్టూ నీడనిచ్చే పెద్ద చెట్లు, వెదురు మొక్కలు నాటడంతో పాటు పండ్ల చెట్లు, ఔషధ మొక్కలను ప్రణాళికబద్ధంగా పెంచాలని సూచించారు. ఈ మొక్కలు విద్యార్థుల ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా సంరక్షణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. డైనింగ్ హాల్‌లో విద్యార్థుల సౌకర్యార్థం డైనింగ్ టేబుల్స్, కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు, వ్యర్థ పదార్థాల సమర్థమైన నిర్వహణ కోసం కంపోస్ట్ పిట్స్ నిర్మాణం, చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేయడానికి ప్రత్యేక బుట్టలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ సహకారంతో ఇప్పటికే చెత్త బుట్టలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు

పర్యావరణ పరిరక్షణలో భాగంగా, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో మునగ, కరివేపాకు వంటి ఉపయోగకరమైన మొక్కలను నాటారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా, వాటి పెరుగుదల కోసం నిరంతర పరిరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రత్యేకంగా సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ సిఎస్ఆర్ విభాగం మరియు సివిల్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, విద్యార్థులకు మరింత మెరుగైన వసతులు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ సుజాత, పాఠశాల ప్రిన్సిపల్ మైథిలి, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, నవభారత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :