తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక ఇల్లందు గెస్ట్ హౌస్ లో ఉన్న ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘు రాంరెడ్డి ని ఇటీవల టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు చేపట్టిన నాగా సీతారాములు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి సత్కరించారు. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితిని వివరించిన నాగా సీతారాములు కార్యకర్తల్లో మనోధైర్యం నింపి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను స్థానిక ఎన్నికల్లో నిలిపి గెలిపించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు కరీం పాషా, ఆకునూరి కనకరాజు, ఓబీసీ టౌన్ అధ్యక్షులు జయప్రకాష్, బొబ్బల వెంకట యాదవ్, సుజాతనగర్ మండల ఓబీసీ అధ్యక్షులు కసనబోయిన లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ