Friday, 18 September 2026 12:57:44 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి- జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 31 October 2025 05:33 PM Views : 454

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరిజన యువతకు ఫర్నిచర్ తయారీ రంగంలో వృత్తి శిక్షణతో ఉపాధి అవకాశాలు : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్‌ను స్ఫూర్తిగా తీసుకొని దేశ సమగ్రత, అభివృద్ధి దిశగా యువత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో “సర్దార్ @150 ఐక్యత పాదయాత్ర” కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని, కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, మై భారత్ సంస్థ సమన్వయంతో దేశవ్యాప్తంగా సర్దార్ @150 ఐక్యత మార్చ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువలు, దేశభక్తి భావనలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయని ఆయన తెలిపారు. విద్యార్థులలో ఐక్యతా స్ఫూర్తి పెంపొందించేందుకు వ్యాసరచన, వాదవివాదాలు, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారని కలెక్టర్ వెల్లడించారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించి, జాతీయ నాయకుల త్యాగాలకు ఘన నివాళి అర్పించడం ప్రధాన ఉద్దేశమని అన్నారు. యువతలో ఐక్యత, దేశభక్తి, సామాజిక బాధ్యతా భావనలను పెంపొందించేందుకు ఈ దేశవ్యాప్త ఐక్యత పాదయాత్రలకు రూపకల్పన చేయబడిందని తెలిపారు. జిల్లా స్థాయిలో నవంబర్ 1 నుండి 15 వరకు మూడు రోజుల పాటు ఐక్యత పాదయాత్రలు, ఆరోగ్య శిబిరాలు, సర్దార్ వల్లభభాయ్ పటేల్ జీవితం పై ప్రసంగాలు, “ఆత్మనిర్భర్ భారత్” ప్రతిజ్ఞలు, సర్టిఫికేట్ ప్రదానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలచిన యువత https://mybharat.gov.in/pages/unity_march వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా, నషాముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా యువత మత్తు పదార్థాల వ్యతిరేకంగా ముందుండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ నిర్మూలనకు జిల్లాలో ఇప్పటికే విస్తృత అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. అనంతరం కలెక్టర్ జిల్లాలో విద్యార్థులు మరియు యువకులను ప్రోత్సహించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ.. విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన పెంపొందించేందుకు జిల్లాలో “విత్తన సేకరణ కార్యక్రమం” చేపట్టినట్లు తెలిపారు. అశ్వాపురం ఎంపీపీ పాఠశాల విద్యార్థులు 40 రకాలుగా 400 కిలోల విత్తనాలను సేకరించడం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని పాఠశాలల్లో చేపట్టి, పర్యావరణ సంరక్షణకు విద్యార్థులను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. మారుమూల గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు హైదరాబాద్‌లోని ఎన్‌ఎస్టీ సంస్థ ద్వారా ఫర్నిచర్ తయారీ రంగంలో మూడు నెలల శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఎనిమిది మంది యువకులు ప్రస్తుతం రూ.15 వేల వేతనంతో ఆరు నెలల అప్రెంటిస్‌షిప్ పొందుతున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 30 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6వ తేదీ నుండి రెండవ విడత శిక్షణ కార్యక్రమానికి అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు , శిక్షణ సమయంలో వసతి, భోజనం, రిజిస్ట్రేషన్ సౌకర్యాలు ప్రైవేటు సంస్థల సహకారంతో ఉచితంగా కల్పించబడతాయని తెలిపారు. మొదటి విడతలో గిరిజన యువకులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు, రెండవ విడతలో కూడా వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుందని, ఇతర అర్హులైన యువత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వారికి కూడా విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా యువత వృత్తి నైపుణ్యంతో స్వయం ఆధారంగా నిలబడి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అలాగే, జిల్లా ప్రజల ఆర్థిక అభివృద్ధికి చేపల పెంపకం, కౌజు పిట్టల పెంపకం వంటి యూనిట్లు ఫలితవంతంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి యూనిట్లను మరింత మంది స్థాపించి ఆర్థికంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. అనంతరం ఐక్యత ర్యాలీ కి సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అన్వేష్ చింతల డిప్యూటీ డైరెక్టర్, మేరా యువభారత్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, జిల్లా క్రీడా శాఖ అధికారి పందమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :