Sunday, 02 August 2026 04:56:40 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రజావాణిలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ వేణుగోపాల్.

Date : 20 July 2026 06:17 PM Views : 91

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ప్రజల నుండి అందిన వినతులు, ఫిర్యాదులను జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, జిల్లా గృహనిర్మాణ సంస్థ (హౌసింగ్) ప్రాజెక్టు డైరెక్టర్‌తో కలిసి స్వీకరించి పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ప్రతి వినతిని సకాలంలో పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయంతో పనిచేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. తక్షణ పరిష్కారం సాధ్యమయ్యే వినతులను వెంటనే పరిష్కరించాలని, మిగిలిన వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించి దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని సూచించారు.ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని వినతులు:కొత్తగూడెంకు చెందిన గుగులోతు కృష్ణకుమారి తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం కోసం రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు మంజూరు కాలేదని విన్నవించారు. ఈ దరఖాస్తును పరిశీలించిన అదనపు కలెక్టర్ తదుపరి చర్యల కోసం కొత్తగూడెం ఆర్డీవోకు ఎండార్స్ చేశారు.సారపాక గాంధీనగర్ గ్రామపంచాయతీకి చెందిన తన్నీరు నాగదేవి ధరణి సర్వే సమయంలో తన ఇంటి పన్ను అంచనా విలువ పొరపాటున సున్నా గా నమోదైందని, దీంతో ఇంటి పన్ను విధించడం లేదని తెలిపారు. ఇంటి పన్ను రసీదు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలు తదితర సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇంటి పన్ను అంచనాను సరిచేసి పన్ను చెల్లించే అవకాశం కల్పించాలని కోరారు. ఈ వినతిపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారికి ఎండార్స్ చేశారు.ఇల్లందు మండలం రొంపేడు గ్రామపంచాయతీకి చెందిన భాగ్యలక్ష్మి తాను ఎం.ఏ., బి.ఎడ్. పూర్తి చేసినప్పటికీ ఉపాధి లేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని, తగిన ఉపాధి కల్పించాలని కోరారు. ఈ దరఖాస్తును పరిశీలించి తదుపరి చర్యల కోసం జిల్లా ఉపాధి కల్పన అధికారికి ఎండార్స్ చేశారు.జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామానికి చెందిన రవీందర్ సర్వే నంబర్ 228/2లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు మంజూరు కాలేదని, ఈ వినతిని పరిశీలించిన అదనపు కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని జూలూరుపాడు తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు.ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :