Thursday, 17 September 2026 05:11:14 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఆర్థికవేత్త, మాజీ ఆర్బిఐ గవర్నర్, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పేరు

Date : 05 June 2025 08:50 PM Views : 945

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ కు కేబినేట్ ఆమోదం కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఆర్థికవేత్త, మాజీ ఆర్బిఐ గవర్నర్, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ గారి పేరుముఖ్యమంత్రి రేవంత్ కు మంత్రి తుమ్మల, MLA కూనంనేని ధన్యవాదాలు, ప్రపంచ స్థాయిలో మారుమోగునున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖ్యాతి, ఆనందోత్సవాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, భద్రాద్రి కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేస్తూ తెలగాణ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు మైనింగ్ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మార్చింది. ఇపుడు మరో ముందడుగు వేసి యూనివర్సిటీకి , ప్రముఖ ఆర్థిక వేత్త, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి పేరును ఖరారు చేసింది. క్యాబినెట్ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు హార్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు మంత్రిమండలి సభ్యులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సహజ వనరులు, మినరల్స్ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం కు భారత ప్రధాని పేరు నామకరణం చేయడంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించునుంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. 300 ఎకరాల్లో విశ్వవిద్యాలయం.సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్స్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా 300 ఎకరాల్లో విశ్వవిద్యాలయం రూపు దిద్దుకుంది. అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారింది. ప్రస్తుతం ఈ మైనింగ్ కళాశాల మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందడంతో వేలాది మంది యువ శాస్త్రవేత్తల ఇక్కడి నుంచే దేశ భవిష్యత్తుకు బాటలు వేయనున్నారు. నాగరికతతో పాటు పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడంలో సహజ వనరులు కీలక పాత్ర పోషించనుంది. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులను అమలుతో జాతీయస్థాయిలో కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే ఇలాంటి విశ్వవిద్యాలయం ఒక అమెరికాలో మాత్రమే ఉన్నది. యూనివర్సిటీలో అందించనున్న కోర్సులు..UG (B.Sc) ప్రోగ్రాంలో Geology, Environmental Science, Geophysics, Geochemistry, PG (M.Sc) ప్రోగ్రాంలో Geology, Environmental Science, Geophysics, Geochemistry, Ph.D ప్రోగ్రాంలో UGC నిబంధనల ప్రకారం కోర్సులను అందించడంతో పాటు ఇప్పటికే బి.టెక్ ప్రోగ్రాంలో ఉన్న Mining Engineering, Computer Science & Engineering, Electrical & Electronic Engineering, Electronics & Communication Engineering, Information Technology లలో ప్రతి కోర్సులో 60 సీట్ల చొప్పున మొత్తం 780 సీట్లతో విద్యనందించడం జరుగుతుంది. మంత్రి తుమ్మల కృషి. మైనింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చడంలో మంత్రి తుమ్మల కృషి అపారం. అలాగే మన్మోహన్ సింగ్ పేరు నామకరణం చేయడం పట్ల మంత్రి తుమ్మల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అపర చాణిక్యుడిగా...అభివృద్ధి ప్రధాతగా, విజన్ కలిగిన నేతగా జిల్లాలో మంత్రి తుమ్మలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అభివృద్ధిలో పట్టు వదలని విక్రమార్కుడిలా పనిచేయడం ఆయన నైజం. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక వ్యవహార శైలి కలిగిన మంత్రి తుమ్మల అభివృద్ధికి తొలి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి ప్రధాతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు ఆయన శ్రమిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం మైనింగ్ కళాశాలను అప్గ్రేడ్ చేసి ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా మార్చడంలో కీలక భూమిక పోషించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటేలా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుకు ముఖ్యమంత్రిని ఒప్పించి కృతకృత్యులయ్యారు. యువతకు ఉద్యోగం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మహర్దశ పట్టనుంది. మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా మంజూరు చేయడంతో ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించునున్నాయి. వేలాదిమంది విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశాలు లభించడంతో పాటు శాస్త్రవేత్తలుగా తయారుచేసే అవకాశాలు ఉన్నాయి. ఎర్త్ సైన్సెస్ వర్సిటీతో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెట్రీ జియాలజీ, జియో మేరపాలజీ, స్ట్రక్చర్ జియాలజీ, ఖనిజ శాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి విభిన్న కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. దేశ స్థాయిలో ఖ్యాతి... భద్రాద్రి కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విద్యాలయానికి అన్ని వనరులు అవకాశాలతో పాటు దేశస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించనుంది. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును ఖరారు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం పేరు మారు మ్రోగనుంది. కొత్తగూడెంలో బొగ్గుతో పాటు అన్ని సహజ వనరులు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఖనిజనిధిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పేరుంది. ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అన్ని అనుకూల వసతులు ఈ జిల్లాలో ఉన్నాయి. నేషనల్ హైవేకి సమీపంలో 300 ఎకరాల్లో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయానికి సమీపంలో మినీ స్టిల్ ప్లాంట్, నవభారత్ లిమిటెడ్ , ఫెరో ఎల్లాయి, ఫెర్రో మెగ్నీషియం, విద్యుత్ ప్లాంట్ ఉన్నాయి. విద్యుత్ ప్లాంట్లు కూడా మరో 300 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాంతానికి సమీపంలో ఐటీసీ పేపర్ బోర్డ్, హెవీ వాటర్ ప్లాంట్ ఉన్నాయి. ఈ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయాన్ని ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. త్వరలో ఈ కల నెరవేరనుంది. రోడ్డు మరియు రైలు రవాణా మార్గాలు ఈ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నాయి. 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ప్రవహిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో నీటి ఇబ్బందులు ఉండవు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :