Sunday, 02 August 2026 04:10:22 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

అనాది నుండి ఆచారాలను కొనసాగిస్తున్న ఆదివాసి నాయక పోడులు, నర్సాపురంలో భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి కొలుపు

Date : 16 March 2026 05:29 PM Views : 387

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 16 తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండల పరిధి పడమట నర్సాపురం లో స్త్రీ శక్తి స్వరూపిణి అయిన పెద్దమ్మ తల్లి కొలుపు కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. కొలుపు అనగా గ్రామదేవతలందరినీ ఒకే చోట చేర్చి మేళ్ల తాళాలతోటి ఆచార సాంప్రదాయంగా పూజించడాన్నే కొలుపు అంటారు. ఇది అనాదిగా శతాబ్దాల కాలం నుండి తరతరాలుగా ఆదివాసి గిరిజన నాయక పోడులు అనుసరిస్తూ, ఆచరిస్తూ, కొనసాగిస్తున్న సాంప్రదాయం. ఈ కొలుపు కార్యక్రమంలో ఆదివాసి నాయక పోడు గిరిజన పూజారులు ప్రధాన పాత్ర పోషిస్తారు. కొలుపు మొదలుకొని ముగింపు వరకు అన్ని కార్యక్రమాలు కటోర నియమనిష్టలతో ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాలతో నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గ్రామ దేవత పెద్దమ్మ తల్లి, రాజు గొడుగులు, పోతురాజు, వీర ఖడ్గం, గణబాలలు, దేవరబాలలు, పూనకాల నడుమ గ్రామంలో కొలుపు కార్యక్రమం కోలాహాలంగా నిర్వహిస్తారు. కొలుపులో ప్రధానంగా పుట్ట బంగారం, బొడ్రాళ్ళు, కొలబియ్యం, సరువుల ఊరేగింపు, పట్నాలు, కళ్యాణం, కొండాలు తొక్కుట (అగ్నిపునీతం) ప్రధాన ఘట్టాలుగా నిర్వహిస్తారు. ఇలాంటి దైవ కార్యక్రమం నిర్వహణతో గ్రామ ప్రజలు, పశువులు, పంటలు, హానికరమైన వ్యాధులు రాకుండా, అంతా సుభిక్షంగా ఉండే విధంగా అమ్మ చూసుకుంటుందని ఆదివాసీల నమ్మకం. గ్రామంలో కొలుపు ఆఖరి రోజులైనా 21, 22 తారీకులలో అనగా శనివారం వనం (అడవి) నుండి సరువులు (మూడు సండ్ర చెట్లు) ను దేవతలకు ప్రతిరూపాలుగా భావించి గ్రామస్తులంతా కలసి ఊరేగింపుగా నగురు అనగా (దేవతను కూర్చోబెట్టి కొలిచే స్థలం) వద్దకు తీసుకొని వచ్చి వాటిని కాల్చి ఆదివారం ఉదయం ఆ నిప్పురవ్వలపై నడిచి తమ భక్తిని, విశ్వాసాన్ని నిరూపించుకోవడంతో ఈ కొలుపు ఘట్టం ముగిస్తుంది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :