Saturday, 19 September 2026 09:55:25 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

మీసేవ సేవల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి – ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు

Date : 12 June 2026 04:08 PM Views : 143

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ప్రజలకు మీసేవ ద్వారా అందిస్తున్న సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ విధానాల అమలుపై ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు అధికారులకు అవగాహన కల్పించారు. శుక్రవారం కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జీపీఓలు, ఆర్‌ఐలు, మీసేవ వీఎల్‌ఈలు, సెక్షన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైదేశ్వరరావు మాట్లాడుతూ ఆదాయ, కుల, నివాస, కుటుంబ సభ్యుల ధృవపత్రాలు, ఈబీసీ, ఓబీసీ తదితర సేవలకు సంబంధించిన మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించబడుతుందని తెలిపారు. దరఖాస్తుదారులు సమర్పించిన డిజిటల్ పత్రాలను మాత్రమే పరిశీలించి నిబంధనల మేరకు ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. భౌతిక పత్రాలను స్వీకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన GPOs & MRIs వెరిఫికేషన్ మొబైల్ అప్లికేషన్ వినియోగంపై అధికారులకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ యాప్ ద్వారా దరఖాస్తుల పరిశీలనను సులభతరం చేసి నిర్ణీత గడువులోగా పరిష్కరించవచ్చని వివరించారు. ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని సూచించారు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను మాత్రమే వసూలు చేయాలని, అదనపు రుసుములు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దరఖాస్తుల నమోదు సమయంలో వివరాలను కచ్చితంగా నమోదు చేయడంతో పాటు డేటా ఎంట్రీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో అధికారులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని, సాంకేతిక లేదా పరిపాలనా సమస్యలు ఎదురైతే సంబంధిత తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో జీపీఓలు, ఆర్‌ఐలు, మీసేవ వీఎల్‌ఈలు, సెక్షన్ అధికారులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :