తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకుడు పేద ప్రజల ఆశాజ్యోతి, స్వర్గీయ వంగవీటి మోహన రంగా 37వవర్ధంతి సందర్భంగా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఏ వి ఆర్ ఫంక్షన్ హాల్ లో మున్నూరు కాపు సంఘం నాయకులు వంగవీటి మోహన రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగా ఆశయ సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు రామిశెట్టి రాంబాబు పిలుపునిచ్చారు. అనంతరం మండల కేంద్రంలో వంగవీటి మోహనరంగా విగ్రహ ప్రతిష్ట గురించి చర్చించటం జరిగినది. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు కాపు సంఘం సీనియర్ నాయకులు వంగవీటి మోహన రంగా అభిమానులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ