తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు టీఎస్ యుటిఎఫ్ టీచర్ భవన్, కొత్తగూడెంలో సుజాతనగర్ మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్నటువంటి పిఆర్సి అమలు చేయాలని మరియు పెండింగ్ డిఎ లను మంజూరు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. డీఎస్సీ _ 2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు ఐ ఎం ఎఫ్ ఏస్ ఆధార్ అప్డేట్ చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత సుజాతనగర్ మండల కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది .అధ్యక్షులుగా జి రాజారావు జనరల్ సెక్రెటరీగా ఎం రాందాస్, వైస్ ప్రెసిడెంట్స్లుగా జయబాయి,వీరభద్రమ్మ ట్రెజరర్ గా బి భాస్కరరావు , సెక్రటరీలుగా సుజాత ,కృష్ణకుమారి, నరసింహారావు ,పద్మ ,సబ్ కమిటీ మెంబర్ గా బి సీతారాం ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు . ఈ మండల కమిటీ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా జి .నాగేశ్వరావు హాజరయ్యారు. ఈ సమావేశానికి జిల్లా కోశాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు , తావూరియా, బిక్కు, దాసు, ఈరు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ