Wednesday, 04 November 2026 12:57:33 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి - శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 11 May 2026 06:10 PM Views : 235

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతుల కల్పనే ప్రాధాన్యం విద్యా ప్రమాణాల మెరుగుదలకు అంకితభావంతో కృషి చేయాలి కళాశాల అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుంది - శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కొత్తగూడెంప్రభుత్వ డిగ్రీ కళాశాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నియోజకవర్గంలోనే ఒక ఆదర్శవంతమైన విద్యాసంస్థగా తీర్చిదిద్దాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద విద్యార్థులకు ఉన్నత చదువులను చేరువ చేయడంలో ప్రభుత్వ కళాశాలల పాత్ర కీలకమని, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కళాశాలలో అకడమిక్ ప్రణాళికలు, విద్యార్థుల హాజరు శాతం, ల్యాబ్, లైబ్రరీ వసతులపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. అధ్యాపకులు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశకులుగా నిలవాలని కోరారు. కళాశాల భవన మరమ్మతులు, అదనపు గదుల, సిబ్బంది కొరత, విద్యా పరికరాలు వంటి అంశాలను తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన విద్యా బోధనతో కళాశాల ప్రతిష్టను పెంచాలని ఆయన సిబ్బందికి సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :