Monday, 02 November 2026 09:57:36 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

ఆస్పత్రిలో తాగునీటి సమస్యకు పరిష్కారం. రూ.2.50 లక్షలతో కొత్త బోరు ఏర్పాటు. మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి. కొత్తగూడెం నగర మేయర్ మూడ్ గణేష్.

Date : 26 September 2026 06:52 PM Views : 295

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ ఆస్పత్రుల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యమని కొత్తగూడెం నగర మేయర్ మూడ్ గణేష్ అన్నారు. కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) ఆవరణలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ.2.50 లక్షల సాధారణ నిధులతో చేపట్టిన నీటి బోర్ పనులను శనివారం ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బోరు ఏర్పాటు పనులు విజయవంతంగా పూర్తయి, విస్తారంగా భూగర్భ జలాలు రావడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది రోగులు, సహాయకులు చికిత్స నిమిత్తం జనరల్ ఆస్పత్రికి వస్తుంటారని తెలిపారు. గత కొద్ది రోజులుగా ఇక్కడ తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడి రోగులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న విషయాన్ని పాలకవర్గం గుర్తించి వెంటనే స్పందించిందని పేర్కొన్నారు. కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి నిధులు కేటాయించి అత్యవసరంగా బోరు వేయించామని, విస్తారంగా నీరు పడటంతో ఆస్పత్రిలో తీవ్ర నీటి కొరతకు తెరపడిందని చెప్పారు. ప్రజారోగ్య కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని, భవిష్యత్తులో కూడా కార్పొరేషన్ పరిధిలోని ప్రజోపయోగ కేంద్రాల్లో సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, ఆస్పత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :