Monday, 02 November 2026 05:31:14 PM
# ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # కొత్తగూడెంలో కాంగ్రెస్ నూతన కార్యాలయం కోసం స్థల పరిశీలన. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. # జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై రాజీలేని పోరాటం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.

భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా.

Date : 30 October 2026 05:38 PM Views : 51

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ???? భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ.106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం.కార్మిక చట్టాల పరిరక్షణకు కదలాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమాలే శరణ్యం.కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా.భారత కార్మిక వర్గ పోరాటాలకు అసలైన దిక్సూచి ఏఐటీయూసీ మాత్రమేనని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా స్పష్టం చేశారు. స్థానిక పెద్దబజార్లోని హమాలీ అడ్డాలో శుక్రవారం జరిగిన హమాలీ కార్మికుల సమావేశంలో అయన మాట్లాడారు. ఈ 106 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన ఘనత ఏఐటీయూసీకి మాత్రమే దక్కుతుందన్నారు. దేశంలో కార్మికులు రక్తం ధారపోసి సాధించుకున్న హక్కులను కేంద్ర పాలకులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల వల్ల అసంఘటిత, సంఘటిత రంగ కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలను రద్దు చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం దుర్మార్గమన్నారు. అక్టోబర్ 31న జరుపుకుంటున్న ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా ఈ వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవాలని, ఆవిర్భావ దినోత్సవ స్పూర్తితో కార్మిక హక్కుల సాధనే లక్ష్యంగా కదలాలన్నారు.. పాలకుల అణచివేత చర్యలను తిప్పికొట్టడానికి కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాటాలు నిర్మిస్తామని ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్మిక ఐక్యతే ఆయుధంగా ముందుకు సాగి చట్టాలను కాపాడుకోవాలన్నారు. హమాలీల సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పాలకుల విధానాలపై రాబోయే రోజుల్లో సమరశీల పోరాటాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తరాల రాజు, నీలం మొగిలి, వెలిశాల మోహన్ రావు, కత్తెర శ్రీనివాస్, అశోక్, సర్పంచ్ రామనాథం తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :