తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌతమ్‌పూర్ 8 ఇన్‌క్లైన్ కాలనీలో వేడుకలను అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో నిర్వహించారు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో కాలనీవాసులు, స్థానిక నాయకులు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను జయప్రదం చేశారు. జాతీయ జెండా ఆవిష్కరణ స్థానిక గౌతమ్ పూర్ సర్పంచ్ సపావట్ కళ్యాణి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి, అందరూ గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో ప్రాంగణం మారుమోగింది. వేడుకల్లో పాల్గొన్న ప్రజలకు, ముఖ్యంగా చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన నాయకులు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, కాలనీ ఐక్యతను చాటుతూ ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో గౌతమ్ పూర్ వార్డు మెంబర్స్ హరి సింగ్, సపావత్ సురేష్, ఎర్ర ప్రియాంక, బోనగిరి నాగమణి, శంకు వార్ సౌమ్య, కేతరాధా, మాలోత్ శిల్ప, వివో పద్మ, గ్రామ పెద్దలు నాయిని సరోజిని, ఎల్తూరి కళావతి, పద్దం విజయ, అజ్జు, బల్లా లక్ష్మణ్, మల్లం అంజయ్య, ఎండి ఇబ్రహీం, పద్దం శ్రీను,వేముల శ్రీను, భోగ సంపత్, రఫీ, అమిన్, నాగేందర్, రవీందర్, యూత్ నాయకులు తాతపూడి అనిల్, కడలి అఖిల్, విత్తనాల శ్రీను, ఎల్తూరి దేవేందర్, ఎండి మహమ్మద్, మిడిదొడ్డి అనిల్, మాచర్ల మహేష్, బల్లవిక్కీ, వేముల సాయి, కనుకుంట్ల రాధాకృష్ణ, మల్లం అజయ్, పద్ధం సాయి, చెవుల విజయ్, ఫోటోగ్రాఫర్ రమేష్, ఆశ వర్కర్లు కే నిర్మల, వెంకటలక్ష్మి, గ్రామపంచాయతీ సిబ్బంది ఎర్ర పాపమ్మ, వజ్రమ్మ, కే రాజేశ్వరి, సోప్పరి నీరజ, పి కాంతామని, బాలీన శివ లీల, బి రాజేశ్వరి, ఎండి పాషా, మస్తాన్ ఖాన్ పఠాన్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ