తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 29 తెలుగు వెలుగు) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముంథా తుఫాన్ తో కురుస్తున్న వర్షాలకు జూలూరుపాడు మండలం లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటివరకు పత్తి పంట పూర్తిగా దెబ్బతినగా ఇప్పుడు ముంథా తుఫాను వలన వరి పొలాలు పూర్తిగా నేలకొరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాణిజ్య పంటలకు కేంద్రబిందువైన జూలూరుపాడు మండలంలో ప్రధానంగా మిర్చి సాగు ఎక్కువగా చేస్తుంటారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మిర్చి పంటలు పూర్తిగా నేలకొరిగాయి . అసలే వ్యవసాయం అంతంతమాత్రంగా సాగుతున్న నేపద్యంలో గిట్టుబాటు ధరలు లేక, పంటలకు అనేక రకాల చీడపీడలు పంటలను ఆశించి నష్టపరుస్తుంటే వివిధ రసాయన పురుగుమందులను వడ్డీలకు అప్పులు తెచ్చి పంటను రక్షించుకున్న రైతు పంట చేతికొచ్చే టైంలో వరుస తుఫానులతో ,అధిక వర్షాలతో రైతులు అన్ని పంటల్లో తీవ్రంగా నష్టపోయామని కవులు రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ