Wednesday, 04 November 2026 07:13:15 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 08 December 2025 07:01 PM Views : 247

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పంచాయతీ ఎన్నికల సంపూర్ణ ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన చండుగొండ మండలంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్‌.ఓలు, ఏఈఓలతో సమావేశమై ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశను నియమ నిబంధనలకు అనుగుణంగా అమలు చేయాలని, ఎటువంటి నిర్లక్ష్యం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు నిర్వహిస్తున్న రికార్డులను విపులంగా పరిశీలించిన ఆయన, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది నుండి పోస్టల్ బ్యాలెట్ జారీ చేసే సమయంలో ఫారం–17, డ్యూటీ ఆర్డర్ కాపీని తప్పనిసరిగా పరిశీలించాలని, పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సంతకం స్పష్టంగా ఉండాలని, అదే లేకపోతే ఆ ఓటు చెల్లదని స్పష్టం చేశారు. అదేవిధంగా బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాలలో ఏర్పాటు చేయాల్సిన వసతులు, పోలింగ్ సిబ్బందికి అందించాల్సిన భోజన ఏర్పాట్లు, రూట్‌వారిగా మెటీరియల్ పంపిణీ, రవాణా ప్రణాళికలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచి ఎంపిక, తిరిగి బ్యాలెట్ బాక్సులు రిసెప్షన్ సెంటర్‌కు పంపిణీ చేసే దశల్లో అత్యంత జాగ్రత్తలు, భద్రతా చర్యలు పాటించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. ఈ పరిస్థితిలో కలెక్టర్ వెంట ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :