Tuesday, 03 November 2026 07:40:48 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు.

Date : 03 November 2026 06:00 PM Views : 409

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు.కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి, సామాజిక మరియు మతపరమైన సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే మహమ్మద్ మస్తాన్ (72) ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, వాటిని ఇతరులకు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు మహమ్మద్ మస్తాన్ న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసు జారీ చేశారు.తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు మహమ్మద్ ఫహీమ్ ఫిర్యాదు చేస్తూ, మహమ్మద్ మస్తాన్‌పై వక్ఫ్ ఆస్తులు, నిధుల దుర్వినియోగం, అవినీతికి సంబంధించిన ఆరోపణలు చేసినట్లు లీగల్ నోటీసులో పేర్కొన్నారు.ఈ ఫిర్యాదుపై స్పందించిన వక్ఫ్ బోర్డు అధికారులు మహమ్మద్ మస్తాన్‌ను వివరణ కోరగా, ఆయన తన వివరణ సమర్పించడంతో పాటు ఆరోపణలకు సంబంధించిన నిర్దిష్ట ఆధారాలను అందించాలని కోరినట్లు నోటీసులో వివరించారు. అనంతరం ఆరోపణలకు సంబంధించి ఆధారాలు, డాక్యుమెంట్లు సమర్పించాలని ఫిర్యాదుదారుడికి ఏడు రోజుల గడువుతో అధికారులు నోటీసు ఇచ్చినప్పటికీ, తమకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సంబంధిత ఆధారాలు సమర్పించలేదని నోటీసులో పేర్కొన్నారు.అయినప్పటికీ తనపై చేసిన ఆరోపణలను వివిధ వ్యక్తులకు ప్రచారం చేస్తూ, సామాజికంగా తన గౌరవ మర్యాదలకు, ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని మహమ్మద్ మస్తాన్ ఆరోపించారు.ఈ నేపథ్యంలో తన న్యాయవాదులు ఎం.డి.సాదిక్ పాషా, డి.సామంత్ కార్యలయం నుండి మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు జారీ చేయించారు.ఈ నోటీసు ద్వారా తప్పుడు, నిరాధార ఆరోపణల ప్రచారాన్ని తక్షణమే నిలిపివేయాలని, ఏడు రోజుల్లో బహిరంగంగా బేషరతు క్షమాపణ చెప్పాలని, గతంలో చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఆరోపణలు చేయకుండా ఉండాలని డిమాండ్ చేశారు.అలాగే తనకు కలిగిన పరువు నష్టం, మానసిక వేదన, సామాజిక అవమానం, తదితర నష్టాలకు పరిహారంగా రూ.50,00,000/- (యాభై లక్షల రూపాయలు) చెల్లించాలని నోటీసులో కోరారు.నిర్దేశించిన గడువులోగా నోటీసులో పేర్కొన్న డిమాండ్లను నెరవేర్చకపోతే, ఎలాంటి తదుపరి నోటీసు లేకుండా సంబంధిత న్యాయస్థానంలో సివిల్ మరియు క్రిమినల్ చట్టపరమైన చర్యలు చేపడతామని, భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 356 కింద అందుబాటులో ఉన్న చట్టపరమైన పరిహారాలను కూడా ఆశ్రయిస్తామని మస్తాన్ నోటిసులో పేర్కొన్నారు. వ్యక్తుల ప్రతిష్ఠ, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే విధంగా నిరాధార ఆరోపణలు చేయడం, వాటిని ధృవీకరించకుండా ప్రచారం చేయడం చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చని ఈ సందర్భంగా న్యాయవాదులు యండి. సాదిక్ పాషా, డి. సామంత్ పేర్కొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :