తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం సరికాదు యేండ్ల తరబడి బ్రిడ్జీపై దుస్థితి నెలకొంది యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు పనులను పూర్తి చేయాలి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ పట్టణపరిధిలోని రామవరం గోధుమవాగు బ్రిడ్జీపై ఏర్పడిన గుంతల మరమ్మత్తులు ముమ్మరంగా సాగుతున్నాయని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ అన్నారు. కొత్తగూడెం పరిధిలోని రామవరం గోధుమవాగు బ్రిడ్జీపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతోపాటు తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో మున్సిపల్ శాఖ ద్వారా మరమ్మత్తు పనులకు ఆదేశించారు. ఈ మేరకు మేయర్ మూడ్ గణేష్ మంగళవారం అక్కడ జరుగుతున్న మరమ్మత్తు పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జీపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడి నిత్యం ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నా నేషనల్ హైవే అధికారులు ఘోరంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమ భాధ్యతను విస్మరించారని అన్నారు. యేండ్ల తరబడి ఈ దుస్థితి నెలకొనడం వల్లే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని, ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన ఈ మరమ్మతు పనులకు ఆదేశించామని స్పష్టం చేశారు. వాహనదారులకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, వేగంగా పూర్తి చేయాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. మేయర్ వెంట కార్పొరేటర్లు కార్పొరేటర్లు బోయిన విజయ్ కుమార్, కూరపాటి సుధాకర్, జి వెంకటేశ్వర్లు, నాయకులు ఎండి యూసుఫ్, ధర్మరాజు, పి సత్యనారాయణాచారి తదితరులు వున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ