తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏఐసీసీ సూచన, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్ లొ BLA నియామక ప్రక్రియని పరిశీలించటానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారిని కో ఆర్డినేటర్ గా నియమించడం జరిగినది. విద్యానగర్ లోని రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలొ నిర్వహించిన బూత్ లెవల్ ఏజెంట్ల నియామక సన్నాహక సమావేశానికి డీసీసీ అధ్యక్షురాలు దేవి ప్రసన్న, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములుతో కలిసి పాల్గొన్న దైద రవీందర్ మాట్లాడుతు బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రాధాన్యత, వారి అవసరాన్ని వివరించి తొందర్లోనే BLA లని నియమించాలన్నారు. ఈ సమావేశంలో మాజీ జిల్లాపరిషత్ చైర్మన్ కంచర్ల.చంద్రశేఖర్,మాజీ సొసైటీ చైర్మన్లు మండే. వీరహనుమంతరావు ,కొత్వాల శ్రీనివాసరావు,సర్పంచులు గుగులోతు జానికిరాం, వజ్జా రామారావు యువజన కాంగ్రెస్ నాయకులు జీవా,రవీందర్,కోటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ