Wednesday, 16 September 2026 06:04:49 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 23 October 2025 06:52 PM Views : 432

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బూర్గంపాడు మండలంలోని మొరంపల్లి బంజార గ్రామంలో సమీకృత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే దిశగా మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల ఆర్థికాభివృద్ధి దిశగా వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలను సమీకరించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రైతులు కూరగాయల సాగుతో పాటు బంతిపువ్వులు, కొర్రమీను చేపల పెంపకం, కౌజు పిట్టల పెంపకం మరియు మేకల పెంపకం వంటి పలు రంగాలను ఒకే ఆవరణలో నిర్వహించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చని తెలిపారు.మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణం సమీకృత వ్యవసాయం యొక్క ప్రాతినిధ్య మోడల్‌గా నిలుస్తుందని, ఈ ప్రాజెక్ట్‌ను ప్రతి మండలంలో అమలు చేయాలన్న లక్ష్యంతో మొరంపల్లి బంజార గ్రామంలో ప్రారంభించినట్లు కలెక్టర్ వివరించారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం ప్రతి షెడ్‌లో చేపల పెంపకం, కౌజు పిట్టల పెంపకం, మేకల పెంపకం వంటి రంగాలను సమన్వయంగా అభివృద్ధి చేయడంతో పాటు షెడ్డు పరిసరాల్లో కూరగాయలు, పూలు సాగు చేసి రైతులు మరింత లాభదాయకమైన ఆదాయాన్ని పొందగలరని సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పలుగు చేతపట్టి షెడ్ నిర్మాణానికి గుంతను తవ్వి పనులను ప్రారంభించారు. అనంతరం మోడల్ ఫామ్‌లో ఇప్పటికే సాగులో ఉన్న కూరగాయలు, బంతిపువ్వుల పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. సమీకృత వ్యవసాయ పద్ధతులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తాయని, ముఖ్యంగా యువ రైతులు ఈ పద్ధతులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.జిల్లాలోని అన్ని మండలాల్లో ఇలాంటి మోడల్ ఫామ్ షెడ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులు వీటి గురించి అవగాహన పొంది, తమ గ్రామాల్లో కూడా ఈ విధానాలను అమలు చేయడం ద్వారా ఆదాయ వనరులను విస్తరించగలరని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డి.ఆర్.డీ.ఏ ఈసీ రాజు, ఏపీఓ వెంకయ్య, ఉపాధి హామీ పథకం ఏపీఓ, ఐకెపి ఏపీఎం, పంచాయతీ సెక్రటరీ, టెక్నికల్ అసిస్టెంట్, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :