Wednesday, 16 September 2026 09:49:37 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

రాబోయే భారీ వర్షాల దృష్ట్యా DDRF,అగ్నిమాపక శాఖ,6th బెటాలియన్ TGSP అధికారులతో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Date : 03 July 2025 05:57 PM Views : 401

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాబోయే వర్షాల దృష్ట్యా సంభవించే వరదలలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న భాదితులను రక్షించడానికి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 05 డీడిఆర్ఎఫ్ బృందాలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.అత్యవసర సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అన్ని శాఖలతో సమన్వయం పాటిస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు.ఇందులో భాగంగానే ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు మరియు 6th బెటాలియన్ టీజీఎస్పి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.జిల్లాలోని ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా శిక్షణను పొందిన డిడిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు.ముఖ్యంగా గోదావరి నది వరదలు సంభవించినప్పుడు నదీ పరివాహక ప్రాంతాలలో నివసించే లోతట్టు ప్రాంత ప్రజలను సంరక్షించడానికి ఈ బృందాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.రెస్క్యూ సమయంలో అవసరమయ్యే లైవ్ జాకెట్స్,లైఫ్ బాయ్ రింగ్స్,బోట్ పెడల్స్,రోప్స్ మరియు ఇతర సామాగ్రి మొత్తాన్ని ఈ బృందాలకు సమకూర్చడం జరిగిందన్నారు.జిల్లాలో ఏ ప్రాంతంలో ఎలాంటి విపత్తు ఎదురైనా అక్కడి బాధితులను సంరక్షించేందుకు సమన్వయంతో అన్ని శాఖల అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.రాబోయే భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.విపత్కర సమయాల్లో డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలను వినియోగించుకోవాలని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,జిల్లా అగ్నిమాపక శాఖాధికారి క్రాంతి కుమార్,6th బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్,ఆపరేషన్స్ ఆర్ఐ రవి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :