తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత.సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుందాం.బోనాల పండుగ ఐక్యతకు నిదర్శనం.కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్.ఆధ్యాత్మిక చింతనతోనే ప్రతిఒక్కరికీ మానసిక ప్రశాంతత లభిస్తుందని, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించేందుకు సంప్రదాయ పండుగలు ఎంతగానో దోహదపడతాయని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ పేర్కొన్నారు. శ్రావణమాస బోనాల మహోత్సవాల సందర్భంగా బుధవారం కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్ పోశమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మేయర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని, గ్రామీణ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్పొరేటర్లు ఎండి యూసుఫ్, భూక్యా శ్రీనివాస్, గడ్డం రాజయ్య, గడ్డం ప్రభాకర్, సతీష్, శాంతి, బండి నర్సింహా, బోయిన విజయ్ కుమార్, గుర్రం వెంకటేశ్వర్లు, సత్యనారాయణ చారి, మంద నాగలక్ష్మి, మిర్యాల రాము తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ