Thursday, 17 September 2026 04:25:51 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

జిన్నింగ్ మిల్లులు యథావిధిగా కొనసాగించాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. రైతుల ప్రయోజనాల దృష్ట్యా బంద్‌లో ఎవరూ పాల్గొనరాదు

Date : 04 November 2025 06:20 PM Views : 380

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిన్నింగ్ మిల్లులు యథావిధిగా కొనసాగించాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.మంగళవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరం లో జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల యాజమాన్య ప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, మరియు సిసిఐ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నవంబర్ 6వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ పిలుపునిచ్చిన బంద్ నేపథ్యంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిన్నింగ్ మిల్లులను బంద్ చేయరాదని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మిల్లులను యథాతథంగా కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.జిల్లాలో L1, L2, L3 రకాల సమస్యలు లేకపోవడంతో, బంద్ అవసరం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలోని రైతులు వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, పత్తి కొనుగోలు మరియు ప్రాసెసింగ్ ప్రక్రియలో అంతరాయం కలగకుండా అన్ని మిల్లులు నిరాటంకంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు పత్తి తేమ శాతం 12% మించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెటింగ్ శాఖ అధికారులు తేమ శాతం పై రైతులకు అవగాహన కల్పించి, పత్తి నాణ్యతను కాపాడే విధంగా సూచనలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా మార్కెట్ యార్డులలో పత్తి ఆరబెట్టడానికి తగిన సౌకర్యాలు కల్పించి, పత్తి తడివేయకుండా అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ సూచించారు. నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి రైతులు మద్దతు ధర పొందాలని కలెక్టర్ సూచించారు.రైతులు సమయానికి పత్తిని మార్కెట్‌కు తీసుకురావడంతో పాటు, మిల్లులు నిరాటంకంగా కొనుగోలు చేయడం ద్వారా జిల్లా వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థ సజావుగా కొనసాగుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి, సిసిఐ బయ్యర్లు, జిల్లా మార్కెట్ కమిటీల కార్యదర్శులు, మరియు జిన్నింగ్ మిల్లుల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :