తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతు భరోసా వానాకాలం పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో జమ. అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. జగన్నాధపురం రైతు వేదికలో రైతులతో కలిసి సీఎం రైతు ఆశీర్వాద సభ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన కలెక్టర్. రైతులకు పంట పెట్టుబడి సహాయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద వానాకాలం–2026 సీజన్‌కు సంబంధించిన నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ నుంచి విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు వేదికలలో రైతులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ములకలపల్లి మండలం జగన్నాధపురం రైతు వేదికలో జిల్లా కలెక్టర్ అంకిత్ రైతులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ