Sunday, 07 June 2026 08:46:59 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధుల శిక్షణను విజయవంతం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు .

Date : 10 March 2026 08:40 PM Views : 285

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమావేశమై ఈ నెల 12వ తేదీన ప్రజా ప్రతినిధులకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడిందని తెలిపారు. ఈ కార్యాచరణను గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయడం వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్యం, అరైవ్ అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత, వ్యవసాయం, విద్య, యువత, మహిళలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడం జరుగుతుందని వివరించారుఈ నెల 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోని గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు జిల్లా కేంద్రాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో ప్రజా ప్రతినిధులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, పాత్రపై అవగాహన కల్పించాలి అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు చేరవేయడంలో ప్రజా ప్రతినిధులు తీసుకోవాల్సిన చర్యలపై కూడా వారికి స్పష్టమైన అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే 99 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టాలపై కూడా ప్రజా ప్రతినిధులకు సంక్షిప్తంగా వివరించాలని పేర్కొన్నారు. మాస్టర్ ట్రైనర్ల సహాయంతో సులభంగా అర్థమయ్యే విధంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుకు శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. గ్రామపంచాయతీలు, పట్టణ ప్రాంతాలలో పారిశుధ్య కార్యక్రమాలు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ–ఆఫీస్ విధానంలో పెండింగ్ ఫైళ్లను వేగవంతంగా క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను దశల వారీగా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తామని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డిపిఓ సుధీర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, మున్సిపల్ కమిషనర్లు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :