Wednesday, 16 September 2026 06:01:09 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

చదువు తోనే సమాజమార్పు సాధ్యమవుతుంది : బామ్ సెఫ్ శ్రీధర్

Date : 20 July 2025 05:46 PM Views : 807

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చదువుతోనే సమాజ మార్పు సాధ్యమవుతుందని, బామ్ సెఫ్ నేషనల్ క్యాడర్, తెలంగాణ ఇంచార్జ్ నల్ల శ్రీధర్ అన్నారు. ఆదివారం రామవరం లోని ఎస్సిబి నగర్ మోడర్న్ ఇక్రా స్కూల్లో జరిగిన బామ్ సెఫ్ క్యాడర్ క్యాంపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చరిత్ర లో ఏంజరిగింది, జరుగుతుంది, జరగబోతుంది అనే విషయాల పైన అవగాహనను పెంచుకోవాలన్నారు. చరిత్ర, సమాజం ఎడల మిడిమిడి జ్ఞానం చాలా నష్ట దాయకమని తెలిపారు. విద్య లేకపోతే, విజ్ఞానం లేకుండాపోతోంది, విజ్ఞానం లేకపోతే నైతికధ లేకుండా పోతుంది, నైతికత లేకపోతే ఐక్యత లేకుండా పోతుందన్నారు. భారతదేశ సామాజిక ఉద్యమకారులైన వారిని నిత్యం మన నం చేసుకోవాలన్నారు.బిర్సా ముండ ఆధ్వర్యంలో 17వ శతాబ్దంలోనే మాభూమి మాదేనంటూ, స్వాతంత్ర ఉద్యమం నడిపి విముక్తి కోసం పోరాటం చేసిన ఘనత మనకి ఉందన్నారు. కేరళలో నారాయణ గురు ప్రజలందరినీ గుడులకు అనుమతించాలని ఉద్యమించడమే కాకుండా, వందలాది గుడులను నిర్మించి విద్య నేర్పించారని తెలిపారు. 1902లోనే మొదటిసారి 50% రిజర్వేషన్లను అమలు చేసిన సాహు మహారాజ్ ఆదర్శనీయుడన్నారు. మద్రాస్ లో పెరియార్ ఇ.వి.రామసామి నేతృత్వంలోనే అందరికీ సమానత్వాన్ని అమలు చేశారన్నారు. రాష్ట్ర పిత జ్యోతిబా పూలే ఆధ్వర్యంలో 200 సంవత్సరాల క్రితమే బాలికలకు పాఠశాలలు నిర్మించి విద్యను అందించారని వెల్లడించారు. వీరందరికీ ఆదర్శమైన గౌతమ బుద్ధుడు మానవతా విలువలను, మనిషి జీవన విధానాన్ని, నైతిక విలువలను బోధించడమే కాకుండా, ప్రపంచ మొట్టమొదటి సామాజిక విప్లవకారుడుగా పేరుగాంచి అభివృద్ధికర సమాజానికి బాటలు వేశారన్నారు. బుద్ధిజాన్ని ఎల్లలు దాటించిన సామ్రాట్ అశోక అడుగుజాడల్లో నడిచిన డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్, గౌతమ బుద్ధున్నీ , రాష్ట్ర పిత పూలేని గురువులుగా ప్రకటించుకొని, ప్రపంచ విద్యావంతుడుగా పేరుగాంచి, అందరికీ సమానత్వాన్ని పంచే రాజ్యాంగాన్ని మనకి అందించారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో రాజ్యాంగం ఉండాలని శ్రీధర్ అన్నారు. కాగా క్యాడర్ క్యాంపకు ముందు మొక్కల వెంకటయ్య, మొక్కల రాజశేఖర్, మొక్కల ప్రేమికుడు చిరంజీవి ఆఫాన్, సంతోష్ కుమార్లు అతిథులకు మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం క్యాంప్ కు గుర్తుగా బాసిత్ నేతృత్వంలోసుగుణారావు, ఎస్ వెంకటేశ్వర్లు, గోనె శ్రీకాంత్, బాలశౌరి, మల్లెల రామనాథం, కొండ పెద్దన్న, శివ, నబీ సాహెబ్, పర్వీన్, వేంకటముత్యం, కృష్ణయ్య , ఛత్రునా యక్, ప్రసాద్ లు స్కూల్లో మొక్కలను నాటారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :