Wednesday, 17 June 2026 03:57:51 PM
# జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్. # అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # సింగరేణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి - గుర్తింపు సంఘం కేంద్ర కౌన్సిల్ సమావేశంలో కూనంనేని. # 16 వ డివిజన్లో ఇందిరమ్మ చీరల పంపిణీ. 18 సంవత్సరాల పైపడిన మహిళలందరికీ చీరలు ఇవ్వాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ.

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 15 June 2026 08:02 PM Views : 45

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈఓలు) బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు, బడిబాట కార్యక్రమం, ఏకరూప దుస్తుల పంపిణీ, పాఠ్యపుస్తకాల పంపిణీ, అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతి, ఆధార్ అప్‌డేషన్, అపార్ నమోదు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ప్రస్తుత విద్యా సంవత్సరంలో బడిబాట కార్యక్రమం కింద జిల్లాకు నిర్దేశించిన 60,415 మంది విద్యార్థుల చేరికల లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని ఆదేశించారు. మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను పెంచేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన బోధన, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. బడిబాట కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించారు.జిల్లాలో ప్రస్తుతం జీరో ఎన్‌రోల్మెంట్ ఉన్న 10 ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సంబంధిత ఎంఈఓలు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ఆయా పాఠశాలల్లో తిరిగి విద్యార్థుల చేరికలు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీలు) ఎంఈఓలు క్రమం తప్పకుండా సందర్శించి, చేరికల పెంపు కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. అలాగే ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసి విద్యార్థులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వెంటనే తొలగించాలని ఆదేశించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ఎంఈఓలదేనని స్పష్టం చేసిన కలెక్టర్, విద్యా ప్రమాణాల పెంపునకు వారు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రతి పాఠశాలలో బోధన, హాజరు, విద్యార్థుల అభ్యాస స్థాయిలపై నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తూ మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను విద్యా రంగంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఇన్చార్జి డి ఈ ఓ శంభు ప్రసాద్, విద్యాశాఖ కోఆర్డినేటర్ల, సతీష్, నాగశేకర శర్మ విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: