తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : త్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డు నందు కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు గొడుగు శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో విస్తృతంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కన్వీనర్ పోనిశెట్టి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో విస్తృతంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం... ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముఖ్యంగా యువకులు,మహిళలు ముందుకు రావడం భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు శుభపరిణామం అని ఇంటింటికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించిన పోనిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.... ఈ కార్యక్రమంలో కొత్తగూడెం పట్టణ ఎస్టి మోర్చా అధ్యక్షుడు రవిచంద్ర నాయక్, ఇంద్రా నాయక్, రెండవ వార్డ్ యువకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ