తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ఆర్గనైజింగ్ కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అభినందించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారం, సమన్వయం కోసం సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ ఆకాంక్షించారు. పోలీసు శాఖలో పరస్పర సహకారం, ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ విధి నిర్వహణలో స్ఫూర్తిదాయకంగా నిలవాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం అసోసియేషన్ చేస్తున్న కృషికి జిల్లా పోలీసు శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఎస్పీ తెలిపారు. నూతన కార్యవర్గం: అధ్యక్షులు: ఎస్. రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ ఏడుల్ల బయ్యారం ఉపాధ్యక్షులు: కృష్ణారావు, వెల్ఫేర్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్; పఠాన్ నాగుల్మీరా ఖాన్, ఎస్‌ఐ కొమరారం కార్యదర్శి: ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ: బి. శంకర్, పీసీ కొత్తగూడెం 1టౌన్ పోలీస్ స్టేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ: కె. వీరేష్ కుమార్, పీసీ డిఎఆర్ భద్రాద్రి కొత్తగూడెం కోశాధికారి: ఎం.డి. రఫీ, హెడ్ కానిస్టేబుల్ కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అదేవిధంగా నూతన కార్యవర్గ సభ్యులుగా భద్రాచలం పిసి బి. రవీందర్ , కొత్తగూడెం త్రీ టౌన్ పిసి వై. చిరంజీవి, దమ్మపేట పిసి ఎ. శ్రీ రామకృష్ణారెడ్డి, ఏఎస్సై లక్ష్మీదేవిపల్లి కె. కస్తూరి, ఏఆర్పిసి బి. కృష్ణయ్య, ఏఆర్పిసి ఎం. చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ పోలీస్ అధికారుల సంఘం సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ