Wednesday, 16 September 2026 11:36:45 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి : ఎస్పీ రోహిత్ రాజు

Date : 20 January 2026 06:39 PM Views : 285

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ KLR ఇంజనీరింగ్ కళాశాలలో పాల్వంచ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన Arrive-Alive కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎస్పీ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి,ప్రజలలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినూత్న కార్యక్రమమే Arrive-Alive-2026 అని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి ప్రజలకు అవగాహన కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన Arrive-Alive కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు పాల్వంచలోని KLR ఇంజినీరింగ్ కళాశాలలోని విద్యార్థులకు అవగాహన కల్పించారు.పాల్వంచ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు.పాల్వంచ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్దినీ,విద్యార్థులు పాల్గొన్నారు.ముందుగా కొన్ని వీడియోలు,ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు భద్రతా నియమాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ వినియోగం,సీటు బెల్ట్ ప్రాధాన్యత,డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు.రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు.రోడ్డుపై విధులలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నా,లేకపోయినా వాహనాలను నడిపేటప్పుడు నియమ,నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని కోరారు.జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి తమ ప్రాణ భద్రతతో పాటు,ఇతరుల భద్రతకు కూడా సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.డ్రంక్ అండ్ డ్రైవ్,ర్యాష్ డ్రైవింగ్,సెల్‌ఫోన్ డ్రైవింగ్,రాంగ్ రూట్,సిగ్నల్ జంపింగ్,ఓవర్ లోడ్ వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు.విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ తమ తల్లీదండ్రుల ఆశయాలకు తగ్గట్టుగా నడుచుకుంటూ మంచిగా చదువుకుని క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి ఎదగాలని అకాక్షించారు. అనంతరం సైబర్ నేరాలపై ఎస్పీ అవగాహన కల్పించారు.అత్యాశకు పోయి త్వరితగతిన డబ్బును సంపాదించాలనే ఆలోచనతో చాలామంది సైబర్ నేరాల బారిన పడి కష్టపడి సంపాదించిన నగదును కోల్పోతున్నారని తెలిపారు.చదువుకున్నవారే ఎక్కువమంది సైబర్ నేరాలు మారిన పడుతున్నారని తెలిపారు.ఓటీపి,హనీ ట్రాప్,ఆన్లైన్ ట్రేడింగ్,సోషల్ మీడియాల ద్వారా ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల గురించి వివరించారు. గంజాయి సేవిస్తూ పట్టుబడితే జైలుకే ప్రభుత్వ నిషేధిత గంజాయిని ఎవరైనా సరఫరా చేస్తున్నట్లుగానీ,సేవిస్తున్నట్లు గానీ తెలిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. చాలామంది యువత గంజాయి మత్తుకు బానిసలై తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఎవరైనా గంజాయి సేవిస్తూ పోలీసులు పట్టుబడితే కేసు నమోదు చేయడమే కాకుండా జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,జిల్లా రవాణాధికారి భూషితా రెడ్డి,మోటారు వాహనాల అధికారి వెంకట రమణ,కళాశాల చైర్మన్ నాగమణి,డైరెక్టర్ సిద్దార్థ్ రెడ్డి,పాల్వంచ సీఐ సతీష్,ఎస్సై సుమన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :