Friday, 18 September 2026 08:18:20 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

వరదలు, అటవీ అగ్నిప్రమాదాల నియంత్రణపై టేబుల్ టాప్ ఎక్సర్సైజ్

Date : 15 May 2026 06:06 PM Views : 246

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మే 18న బూర్గంపాడులో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణ జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఏ) ఆధ్వర్యంలో వరదలు, అటవీ అగ్నిప్రమాదాల నియంత్రణ, విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై శుక్రవారం జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీమతి విద్యా చందన, సీఆర్పీఎఫ్ కమాండెంట్ రితికేష్ ఠాగూర్, జిల్లా ఫైర్ అధికారి క్రాంతి కుమార్‌తో పాటు డీఎఫ్‌ఓ, పోలీస్, రెవెన్యూ, ఎస్‌డీఆర్‌ఎఫ్, సాగునీటి శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మరియు ఇతర లైన్ డిపార్ట్‌మెంట్‌ల అధికారులు ఐడీఓసీ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌డిఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బహాల్ మాట్లాడుతూ జిల్లాల్లో వరదలు, అటవీ అగ్నిప్రమాదాలు లేదా ఇతర విపత్తులు సంభవించిన సమయంలో అధికార యంత్రాంగం వేగంగా, సమన్వయంతో స్పందించేందుకు ముందస్తు సిద్ధత ఎంతో అవసరమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరద ప్రభావిత ప్రాంతంగా గుర్తించబడిన నేపథ్యంలో వరదలు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, సహాయక చర్యలు, అత్యవసర సేవల నిర్వహణ వంటి అంశాలపై ఈ కాన్ఫరెన్స్‌లో విస్తృతంగా చర్చించారు. జిల్లాలో అటవీ అగ్నిప్రమాదాల నివారణ, ప్రమాదాలు సంభవించిన సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో ఎలా స్పందించాలి, అగ్నిమాపక చర్యలను ఎలా చేపట్టాలనే అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ నెల 18న బూర్గంపాడు మండలంలో నిర్వహించనున్న మాక్ ఎక్సర్సైజ్‌ను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని ఎన్‌డిఎంఏ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. మాక్ డ్రిల్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :