తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా రెట్టింపుగా పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టడంలో భాగంగా సైబర్ సెక్యూరిటీ సెల్ పనిచేస్తుంది. సైబర్ మోసాలను నివారించడంలో భాగంగా జిల్లా ఎస్పి శ్రీ రోహిత్ రాజ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సీనియర్ సిటిజన్స్ కు అవగాహన కార్యక్రమాన్ని జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ మరియు ఇంటర్నెట్ టెక్నాలజీ బాగా పెరిగిపోయి ప్రతి ఒక్కరికి అందుబాటులో స్మార్ట్ మొబైల్స్ అలాగే ఇంటర్నెట్ అలాగే ఐ పాడ్స్ అందుబాటులో ఉంటున్నాయి. నగదు బదిలీలు బ్యాంకింగ్ వ్యవహారాల కోసం ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఇంటర్నెట్ పై ఆధారపడినారు. ప్రతిరోజు చాలా లావాదేవీలను వ్యక్తిగతంగా మొబైల్ ఫోన్ల ద్వారా వినియోగదా రకాలు సీనియర్ సిటిజన్స్ కూడా సైబర్ మోసగాళ్ల బారినపడి ఆర్థికంగా నష్టపోతున్నారు, ఎవరు కూడా సైబర్ మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని ఉద్దేశంతో ఈరోజు సీనియర్ సిటిజన్స్ కోసం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాము అని తెలిపారు. ఫేస్బుక్, వాట్సప్, స్కైప్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ (x) ఇలా అనేక సామాజిక మాధ్యమాల ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజలకు మెసేజ్ లు పంపిస్తూ ఫోన్ చేస్తూ బహుమతులు వచ్చాయి, మంచి ఆఫర్స్ ఉన్నాయి, సీనియర్ సిటిజన్స్ కోసం హెల్త్ స్కీములు ఉన్నాయి, ఇన్సూరెన్స్ స్కీములు ఉన్నాయి, ప్రమాదం జరిగినది, హాస్పటల్ లో డబ్బు కట్టాలి, ఆధార్ అప్డేట్ చేయాలి, బ్యాంక్ కు ఫోన్ నంబర్ లింక్ చేయాలి అంటూ ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా లేదా మొబైల్ ఫోన్కు ఎస్ఎంఎస్ ద్వారా లేదా బ్లూ లింకు ద్వారా సమాచారాన్ని చేరవేసి మీ వ్యక్తిగత వివరాలను అందులో నమోదు చేయమంటారు అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు ఓటిపి వివరాలను చెప్పమంటారు ఎవరు కూడా అలాంటి సందేశాలను నమ్మి వ్యక్తిగత వివరాలను అపరిచితులకు ఇవ్వవద్దు అని తెలిపారు. మీకు ఫలానా కంపెనీ ద్వారా బహుమతి వచ్చింది ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాలి అని బురిడీ కొట్టిస్తారు, మీకు తెలిసిన వారి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేసి మెసేజ్ లు పెడుతూ హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయి ప్రమాదం జరిగింది అర్జెంటుగా డబ్బులు కావాలని మోసం చేస్తారు ఇలాంటి మెసేజ్లకు స్పందించి ఎవరు కూడా డబ్బులు పంపించవద్దు దానిలో నిజానిజాలు ముందుగా తెలుసుకోవాలి అన్నారు, మీ బ్యాంక్ అకౌంట్ లేదా ఏటీఎం లేదా క్రెడిట్ కార్డు అప్డేట్ చేయాల్సి ఉంది అని ఓటిపి వస్తుంది అని తెలిపి ఓటిపి వివరాలు తెలుసుకొని మోసాలు చేసి ఆర్థిక నష్టాలు చేస్తారు. ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్ కు అనుసంధానం చేయాలని మోసాలకు పాల్పడతారు. మీ పిల్లలు, బందువులు డ్రగ్స్ కేసులో, పాస్ ఫోర్ట్ కేసులో ఇరుక్కున్నారు మేము ముంబై, ఢిల్లీ పోలీసును మాట్లాడుతున్నాము అని తెలిపి వాళ్ళని కేసు నుండి కాపాడాలంటే మీరు కొంత డబ్బు చెల్లిస్తే వారిని కేసులో లేకుండా చూస్తామని భయపెట్టి డబ్బులు వసూలు చేస్తారు ఇలాంటి వాటిని అసలు నమ్మవద్దు. మీరు పలానా వస్తువు కొన్నందుకు మీకు బహుమతి వచ్చింది ఆ బహుమతి అమౌంట్ మీరు అకౌంట్లో క్రెడిట్ చేసుకోవాలంటే మేము పంపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ చేసుకోవచ్చు అని ఫోన్ ద్వారా తెలుపుతారు అలాంటివి అసలు నమ్మవద్దు. అపరిచితులు వీడియో కాల్ చేసినప్పుడు తెలియకుండా వీడియో కాల్ అటెండ్ చేయవద్దు ఆ వీడియో కాల్ వెనకాల నగ్నంగా ఉండే స్త్రీ ఉండి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంది అన్నారు. ఎవరైనా సైబర్ మోసాల బారిన పడినట్లు గుర్తిస్తే గుర్తించిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు, www.cybercrime.gov.in కు పిర్యాదు చేస్తే అకౌంట్ ఫ్రీజ్ చేసి మీ డబ్బు ఇప్పించే అవకాశం ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్, ఎస్సై మస్తాన్ మరియు సైబర్ వారియర్ WPC ప్రణతి హాజరయ్యారు
Admin
తెలుగు వెలుగు టీవీ