తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థులు చదువుతో పాటు లలిత కళల వైపు దృష్టిసారించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు.శుక్రవారం సాయంత్రం రామకృష్ణ శారదాకుటిర్ అర్ధనారీశ్వర స్వామి దేవాలయంలో అమృత వర్షిణి మ్యూజిక్ అకాడమీ కుటుంబ సభ్యులకు 81 స్వర అర్చన కార్యక్రమం నిర్వహించగా జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా..అమృతవర్షిణి మ్యూజిక్ అకాడమీ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొనందుకు ఆనందగా ఉందన్నారు.కొత్తగూడెంలో అమృత వర్షిణి అకాడమీ ఏర్పాటు చేసి విద్యార్థులలో దాగిఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి ప్రపంచానికి చాటుతున్న నిర్వహకుడు అలిపిరెడ్డి ఉదయ్ భాస్కర్ జిల్లా ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అందులో భాగంగా 40మంది బాల,బాలికలకు,విద్యార్థులకు 81 స్వర అర్చన పాల్గొన్న వారికి ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు.అదేవిధంగా విద్యార్థుల మేధోశక్తికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతాయని గుర్తుచేశారు.అనంతరం అమృత వర్షిణి అకాడమీ నిర్వహకుడు ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ..ఈ సంకీర్తనలో భాగంగా 55వ దేవాలయంలో స్వామి సన్నిధిలో సంకీర్తన విజయవంతం చేసిన అమృత వర్షిణి మ్యూజిక్ అకాడమీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం వన్ టౌన్ సీఐ కరుణాకర్,అమృత వర్షిణి అకాడమీ సభ్యులు,విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ